చంద్రబాబునాయుడు.. రాజకీయ చాణక్యుడిగా దేశవ్యాప్తంగా పేరొందిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను తొమ్మిదేళ్లకుపైగా పాలించిన నాయకుడు. ఆ తర్వాత ఏపీని ఐదేళ్లపాటు పాలించాడు. అంటే ఓవరాల్ గా తన రాజకీయ జీవితంలో దాదాపు 14 ఏళ్లు పాలించాడు. 

chandrababu unlucky కోసం చిత్ర ఫలితం


మన పురాణాల్లో 14 ఏళ్ల పాటు రాముడు వనవాసానికి వెళ్లాడు.. 14 ఏళ్ల పాటు పాండవులు అజ్ఞాతవాసం చేశారు. ఇప్పుడు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రి పాలన తర్వాత పదవీవిరమణకు సమయం ఆసన్నమైందా..అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 



ఇటీవల పవన్ కల్యాణ్ కూడా ఓ సభలో చంద్రబాబు ఇక గౌరవంగా రిటైర్ మెంట్ అయితే మంచిదని కామెంట్ చేశారు. టీడీపీకి చుక్కలు చూపిస్తానన్నారు. ఐతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం ఉందా.. అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. 

సంబంధిత చిత్రం

ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపు అనుమానంగానే ఉంది. ఒకవేళ చంద్రబాబు ఓడి.. జగస్ సీఎం అయిన పక్షంలో ఆయనకు చుక్కలు చూపించకమానడు. మరోవైపు ఓటు కు నోటు వంటి కేసుతో పాటు అనేక అభియోగాలపై విచారణలు ఎటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు గౌరవంగా రిటైర్ కావడం అనుమానమే.



మరింత సమాచారం తెలుసుకోండి: