2014 ఎన్నికల్లో అనంతపురంలో మెజారిటీ సీట్లు టీడీపీ దక్కించుకున్నది. రాయలసీమలో టీడీపీకి పట్టున్న ఏకైక జిల్లా. బాబు మార్చాలి అని గట్టిగా అనుకున్న సిట్టింగు ఎమ్మెల్యేల్లో గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఒకరు. అయితే ఈ ఎమ్మెల్యే కాస్త రెబల్ టైప్. తనకు టికెట్ దక్కకపోయినట్టు అయితే.. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు ఏ మాత్రం వెనుకాడే  వ్యక్తి కాదు. ఆ లెక్కతోనే జితేందర్ గౌడ్ కు మళ్లీ తెలుగుదేశం టికెట్ దక్కిందని స్థానికులు అంటున్నారు. ఇక రెండో విషయం అనంతపురం ఎంపీ సీటు పరిధిలో ఎమ్మెల్యే  టికెట్లు అన్నీ కమ్మవాళ్లకు దక్కుతున్నాయి.

Image result for guntakal

బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గుంతకల్ లో కూడా అభ్యర్థిని మారిస్తే మొదటికే మోసం వస్తుంది. బీసీలకు అని ఇచ్చిన టికెట్లు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే ఈ అసెంబ్లీ సీటును బాబు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జితేంద్రగౌడ్ కు ఇచ్చారు. ఈ రెండు అంశాలనూ స్థానిక తెలుగుదేశం వాళ్లే చెప్పారు. ఇక ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే: ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఎలా ఉంటుందో ఇలాంటి నియోజకవర్గాలను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. -రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటిని ఇక్కడి ప్రజలు బాగా ఆశించారు. ఆ ఆశలతోనే గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారు కూడా.

Image result for ycp and tdp

అయితే.. వాటి అమలు ప్రజలను బాగా అసహనానికి గురిచేసింది.-స్థానికంగా ఎమ్మెల్యేపై కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ చార్జి మొదటి నుంచి గట్టిగా పనిచేస్తూ వస్తున్నారు.-తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కుతుందని ఆశించి అందులో చేరిన మధుసూదన్ గుప్తా చివరకు టికెట్ దక్కకపోవడంతో వెను వెంటనే రాజీనామా చేశారు.-ఆయన తన వైశ్య సామాజికవర్గ ఓట్లను జనసేన వైపుకు తీసుకెళ్లిపోవచ్చు. గుంతకల్ లో వారి జనాభా బాగానే ఉంది. బీసీల్లో చాలామంది వ్యవసాయం చేసుకునే వాళ్లే, అలాంటి వారందరూ రుణమాఫీ విషయంలో ఆశలు పెట్టుకుని అడియాసల పాలయ్యారు.-కరువు ప్రభావం ఈ ప్రాంతంపై గట్టిగా ఉంది. బాబు ఉంటే కరువే .. అని కూడా కొంతమంది రైతులు కుండబద్ధలు కొట్టారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా ఆశలు పెట్టుకోదగిన నియోజకవర్గంగా నిలుస్తోంది గుంతకల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: