పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాను పోటీ చేసే నియోజకవర్గం నుంచి మొన్న నామినేషన్ వేస్తూ తాన ఆస్తులు, అప్పులు అఫిడివిటీలో పొందుపరిచారు. ఆస్తుల లెక్కల విషయం పక్కన పెడితే తన అప్పులు మాత్రం పెద్ద మొత్తంలో బాకీలు ఉన్నట్లు అఫిడివిటీలో తేలింది. దాదాపుగా 33 కోట్లు డబ్బులు బకాయిలు చెల్లించాల్సి ఉందట. అయితే ఇందులో ఎక్కువ మొత్తం సినీరంగం వ్యక్తులే అంట.తన వదిన అయిన సురేఖ నుంచి కోటి రూపాయలకు పైగానే అప్పు చేశాడంట.


అలాగే అతనికి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర కూడా బకాయి పడ్డాడు. అయితే అది 2 కోట్లకు పై మాటే ఉంటుందట. అయితే వీళ్ళతో ఉన సాన్నిహిత్యం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ అప్పులేవి పెద్ద విషయం కాదు కానీ తన రాజకీయ అరంగేట్రం చేయక ముందు సినిమాలు చేస్తానని ఒప్పుకొని అడ్వాన్సులు తీసుకున్న మొత్తం మాత్రం భారీగానే ఉందంట. వేంకటేశ్వర క్రియేషన్స్ వాళ్లకు 27 లక్షల రూపాయిలు బకాయిలు పడ్డట్టు సమాచారం. అయితే ఈ సంస్థ అధినేత దిల్ రాజు అని తెలిసిన విషయమే, కానీ పవన్ కళ్యాణ్ ఈ సంస్థతో సినిమా తీస్తున్నారు అని ఎప్పుడు సమాచారం రాలేదు. అయితే దిల్ రాజు కూడా ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు.


ఈ సంస్థతో ఒప్పందం ఎప్పుడూ కుదిరింది అన్నది అర్థం కావడం లేదు. అయితే మైత్రి మూవీస్ మేకర్స్, బాలాజీ మీడియా వాళ్ళతో పవన్ కళ్యాణ్ కు కమిట్మెంట్ ఉన్న విషయాలు వాస్తవమే. మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా కోసం భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడట. అయితే అది 5.5 కోట్ల రూపాయలు అని తాను ఇచ్చిన అఫిడివిటీలో తేలింది. అలాగే 2 కోట్ల రూపాయల దాకా బాలాజీ సంస్థకు బకాయి ఉన్నట్లు తేలింది.మైత్రి మూవీస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని గట్టిగానే ప్రయత్నించారు. ఆయన తమిళ మూవీ తేరి రీమేక్ లో నటించాల్సి ఉన్నింది. దీనికి గాను భారీ మొత్తంలో అడ్వాన్స్ ను పవన్ కు ముట్టచెప్పరు. కానీ అజ్ఞాతవాసి మూవీ తరవాత పవన్ ఫుల్ టైమ్ రాజకీయంలో మునిగాక ఆ సినిమాకు బ్రేక్ పడింది.


అయితే ఈ సినిమా పై పవన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మైత్రి మూవీస్ వాళ్లకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పవన్ ను గట్టిగా తమ అడ్వాన్స్ వెన్నకి ఇవ్వాలని అడగనులేరూ. అయితే మొన్నటి అఫిడివిటీలో తన అప్పులు గురించి ప్రస్తావించడంతో  తమ డబ్బులు తిరిగి రావడమో లేక తమకు ఒక సినిమా చేసి పెట్టాడమో ఖాయమని మైత్రి, బాలాజీ సంస్థలు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: