2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు..పవన్ కళ్యాణ్ మరియు మోడీ ల సహాయంతో ఎన్నికలలో పోటీ చేసి కొద్దిపాటి ఓటింగ్ శాతం తో అధికారంలోకి వచ్చారు. అయితే ఈ క్రమంలో ఆ సమయంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమ్మాయిల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలలో అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న నేపథ్యంలో చంద్రబాబుతో ఉన్న బిజెపి మరియు జనసేన పార్టీలు మద్దతు ఉపసంహరించుకుని రాబోతున్న ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే.

Image result for chandrababu

ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా రాబోతున్న ఎన్నికలకు గతంలో లా కాకుండా ఒంటరిగా పోటీకి రెడీ అయిన నేపథ్యంలో చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా వెళ్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఓటమిపాలు అవటం ఖాయమని వార్తలు కామెంట్లు వినబడుతున్నాయి. గత ఎన్నికలలో దాదాపు చివరి వరకు ఓటింగ్ పడకముందు తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు లేవు అయితే ఎప్పుడైతే మోడీతో మరియు జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందో అప్పుడే ఆంధ్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

Related image

అయితే ప్రస్తుతం గత ఎన్నికలలో ఇచ్చిన అబద్ధపు హామీలు మరియు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో చంద్రబాబు ద్వంద వైఖరి ప్రదర్శించడం తో రాబోతున్న ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటమి ఖాయమనే కామెంట్లు వినపడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: