ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నేతలు స్పీడ్ పెంచారు. పార్టీలు అభ్యర్థుల ప్రకటనలు, వ్యూహాప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇక మోదీ, రాహుల్ పోటీలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. వారణాసి నుంచే మోదీ బరిలోకి దిగబోతున్నారు. అమేథీ నుంచి రాహుల్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే రాహుల్ మళ్లీ గత ప్రత్యర్థినే ఎదుర్కోవాల్సి రావడం ఆసక్తి కలిగిస్తున్న అంశం.

Image result for amethi lok sabha

అమేథీ నుంచి మరోసారి కేంద్రమంత్రి స్మృతి ఇరానీని బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో కూడా ఆమె రాహుల్ ను ఢీకొట్టింది. అప్పుడు లక్ష 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయినా ఆమె నిరాశ చెందలేదు. అమేథీపై పట్టుకోసం అప్పటి నుంచే పోరాడుతోంది. ఓడిపోయినా కేంద్రంలో అధికారంలో ఉండడంతో అమేథీపై ప్రత్యకంగా దృష్టిపెట్టింది. దీంతో ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగాలని స్మృతి ఇరానీ నిర్ణయించుకుంది.

Image result for amethi lok sabha

అమేథీ గాంధీ ఫ్యామిలీకి కంచుకోట.. నాడు రాజీవ్ గాంధీ నుంచి నేడు రాహుల్ గాంధీ వరకూ ఇది కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ వస్తోంది. 2004 నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీని తమ భుజాలపై మోస్తున్నారు ఇక్కడి ప్రజలు. అయితే ఈసారి గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2014లో ఆయనపై స్మృతి ఇరానీని పోటీకి దింపింది. యూపీ అంతటా బీజేపీ గాలి వీచినా..  అమేథీలో మాత్రం రాహుల్ ని కదపలేకపోయారు. స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇచ్చి.. రాహుల్ మెజార్టీని తగ్గించగలిగారు. 2009లో రాహుల్ 3 లక్షల 70 వేల మెజార్టీతో గెలిచారు. 2014లో ఆయన మెజార్టీ లక్షా 7 వేల ఓట్లకు తగ్గిపోయింది. రాహుల్ కి గట్టిపోటీ ఇచ్చిన స్మృతి ఇరానీని బీజేపీ మంత్రిపదవితో సత్కరించింది. కేంద్ర మంత్రిగా ఉన్నా స్మృతి ఇరానీ.. అమేథీ మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. తాను అక్కడ ఎంపీ కాకపోయినా.. అమేథి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్కడ పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించేందుకు ప్రయత్నించారు.

Image result for amethi lok sabha

2014లో అమెథీలో ఓడిపోయినా ఆమె ఢిలా పడిపోలేదు.. అమేథి అభివృద్ధే తనకు ముఖ్యమని ప్రకటించిన స్మృతి.. 2019 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రిత్రం ప్రధానమంత్రి మోడీ అమేథిలో ఏకే 203 రైఫిల్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద రచ్చ చేసింది. తాను గతంలోనే ఈ ప్యాక్టరీని ప్రారంభిచానంటూ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. దీనికి స్మృతి ఇరానీ గట్టిగా సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లుగా స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. 2019లో కూడా ఇద్దరే అమేథీ నుంచి పోటీడపతుండటం.. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది.

Image result for amethi lok sabha

యూపీలో ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ మీద కూడా విమర్శల దాడిని తీవ్రం చేశారు స్మృతి ఇరానీ. తాజాగా యూపీలోని వారణాసిలో ప్రియాంకా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహుదుర్ శాస్త్రి కి దండ వేశారు. అయితే అది వివాదాస్పదంగా మారింది. ప్రియాంక గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రిని ఘోరంగా అవమానించారంటూ ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం మీద దాడి చేసే విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టడంలేదు. మరి బీజేపీ టార్గెట్ ఎంతవరకూ రీచ్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: