ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఊహించ‌ని అనుభ‌వం ఇది. ఆయ‌నకు ఓ ఎంపీ అభ్య‌ర్థి పాదాభివంద‌నం చేశారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ప్రచార సభలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంద‌ర్భంగానే జ‌గ‌న్ కాళ్లు మొక్కారు.  పలాస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 18ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ఆర్థికంగా ఎంతో నష్టపోయానని తెలిపారు.  పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేశానని చెప్పారు.

టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాపారాలను అష్టదిగ్భందం చేశారని ఆరోపించారు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయాల్లో ఎన్నో పోరాటాలు చేశాను. ఆర్థికంగా ఏమాత్రం స్థోమత లేకుండా చేశారు. ఒక యోగ్యత లేదు, అవకాశం లేదు. పోరాడే శక్తి లేకున్నా జగనన్న పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా ప్రజాసేవ చేస్తాను. భావోద్వేగంతో దువ్వాడ శ్రీనివాస్.. వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డికి పాదాభివందనం చేశారు.  


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు  టికెట్లు ఇవ్వాలంటే ఎంత డబ్బు ఉంది..ఎంత ఖర్చు చేస్తావు అంటారని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. తాను ఆర్థికంగా వెనుకబడినా వ్యక్తిని అయినా కూడా నాకు సీటు ఇచ్చి వైఎస్‌ జగన్‌ తోడుగా ఉన్నారని కొనియాడారు. మా లాంటి అభాగ్యుడికి, సామాన్యుడికి టికెట్టు ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. జన్మ జన్మలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఏ నమ్మకంతో నాకు టికెట్టు ఇచ్చావో ఆ నమ్మకంతో పని చేస్తానని ప్రమాణం చేసి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: