విశాఖ జిల్లా ఏజెన్సీ రాజకీయం వేరుగా ఉంటుంది. గిరిజనం గురించి రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ వారు మాత్రం తమ పని తాము చేసుకుంటూనే అన్ని పార్టీల గురించి. వాటి సిధ్ధాంతాల గురించి ఆలోచిస్తారు. సరైన టైంలో సరైన తీర్పు చెప్పడం గిరిజనులకే చెల్లింది.


ఇదిలా ఉండగా జగన్ పాడేరులో నిర్వహించిన సభ అధిరింది. ఆ సభకు గిరిజనం మొత్తం పోటెత్తారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తారు. అయితే పాడేరు సభకు మొత్తం మన్యమే కదిలి వచ్చిందా అన్నంతగా జన సందోహాం కనిపించింది. జగన్ ఈ సభలో చేసిన ప్రతి హామీకి గిరిజనుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా  బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తానంటూ జగన్ ఇచ్చిన హామీతో గిరిజనం ఉప్పొంగిపోయింది. ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటారన్న నమ్మకాన్ని గిరిజనులు వ్యక్తం చేయడం విశేషం.


 అదే విధంగా పాడేరులో గత ఎన్నికల్లో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన గిడ్డి ఈశ్వరి ఇపుడు టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. వైసీపీ కొట్టగళ్ళ భాగ్యలక్ష్మిని నిలబెట్టింది. అలాగే,  అరకు ఎంపీ సీటుకు కూడా మాజీ ఎమ్మెల్యే దేవుడు కూతురు మాధవిని నిలబెట్టింది. ఇక అరకు నుంచి శెట్టి  ఫల్గుణుడు  అనే మాజీ బ్యాంక్ అధికారిని నిలబెట్టింది. ప్రచార పర్వంలో ఈ ముగ్గురూ ఇప్పటికే దూసుకుపోతున్నారు. జగన్ పాడేరు సభలో వైసీపీకి రెట్టించిన ఉత్సాహం వచ్చింది. నాయకులు పార్టీలు మారినా జనం మాత్రం వైసీపీ వైపే ఉన్నరనడానికి జగన్ సభ పెద్ద ఉదాహరణ అని అంటున్నారు. ఇక్కడ వైఎస్సార్ పట్ల ఉన్న అభిమానం ప్రతి ఎన్నీకల్లో వైసీపీకి బాగా కలసివస్తోంది. జగన్ రోడ్ షోలో పోటెత్తిన జనం అదే నిజమని చెబుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: