ఏపీలో జ‌రుగుతున్న ఎన్నికల పోలింగ్ తేదీ ఓ వైపు స‌మీపిస్తున్న త‌రుణంలో కీల‌క పొత్తుల మ‌ధ్య బీట‌లు వారింది. సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ జనసేన పార్టీతో సీపీఐ తెగ దెంపులు చేసుకుంటుందనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారనున్నాయని తాజాగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా ప‌లువురు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌లు ఫ‌లిస్తే...ఈ రెండు పార్టీలు త‌మ దారి తాము చూసుకోవ‌డం ఖాయ‌మంటున్నారు. 


ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో వామపక్షాలు, బీఎస్పీ పొత్తులతో జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి సిీపీఐ అభ్యర్థిగా సీనియర్‌ న్యాయవాది చలసాని అజయ్‌కుమార్‌ను పార్టీ ప్రకటించింది. ఆయన ఈ నెల 25న నామినేషన్‌ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు కూడా. అదే రోజున విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి సిీపీఎం అభ్యర్థి సిహెచ్‌ బాబూరావు కూడా నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సిీపీఎం తరపున సీతారాం ఏచూరి, సిపిఐ తరపున డి రాజా హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా శని వారం సాయంత్రానికి జనసేనలో సమీకరణాలు మారిపో యాయి. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి, నూజివీడు అసెంబ్లికి అభ్యర్ధులను ప్రకటించే ప్రయత్నం చేసింది. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి జనసేన తన అభ్యర్ధిగా ముత్తంశెట్టి ప్రసాదబాబు పేరుని ప్రకటించడంతో సిీపీఐ ఖంగుతింది. మాజీ మేయర్‌ ముత్తంశెట్టి రత్నబిందుకు ప్రసాద్‌ సోదరుడు. 


పొత్తులు ఉన్న‌ప్ప‌టికి కూడా నూజివీడుకు జనసేన అభ్యర్ధిని ప్రకటించే సన్నాహాలు చేస్తుండడంతో విషయం తెలుసుకున్న సీపీఐ అత్యవసరంగా సెక్రటేరియట్‌ సమావేశాన్ని ప్రారంభించింది. విజయవాడ పార్లమెంట్‌కు, విజయవాడ పశ్చిమ స్థానా నికి తమ అభ్యర్థులను రంగంలోకి దించాలని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. శనివారం పొద్దుపోయేంత వరకు సిపిఐ సమావేశం జరుగుతున్నందున నాయకులు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో పొత్తుల‌కు బీట‌లు వార‌డం ఖాయ‌మంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: