విజయనగరం జిల్లా టీడీపీకి దశాబ్దాలుగా కొమ్ము కాస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను కట్టబెడుతోంది. పేరున్న, నోరున్న కుటుంబాలు ఎన్నో అక్కడ ఉన్నాయి. ఆ కుటుంబాలు ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ వైపునే నిలిచి గెలుపు జెందాని ఎగరేస్తున్నాయి. అలాగే బలమైన సామజిక వర్గాలు కూడా టీడీపీ వైపుగా ఉంటూ వచ్చాయి.


అయితే ఈసారి సీన్ మారింది. అనేక అసెంబ్లీ సీట్లతో అసమ్మతి గట్టిగానే ఉంది. విజయనగరంలో తీసుకుంటే ఏకంగా అశోక్ కూతురు అదితి గజపతి రాజు కే అసమ్మతి షాక్ తప్పడంలేదు. చంద్రబాబు సర్దిచెప్పినా టికెట్ దక్కని  సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత వర్గం ప్రచారంలో పాలుపంచుకోవడంలేదు. తమని అసలు పట్టించుకోకపోతే ప్రచారానికి ఎలా వస్తామని మీసాల గీత వర్గం నిలదీస్తోంది.  దాంతో ఓ బలమైన సామాజిక వర్గం కూడా టీడీపీకి ఇక్కడ దూరమవుతోంది.  


ఇదే పరిస్థితి గజపతినగరంలో కూడా ఉంది. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు ఈసారి టికెట్ వద్దు అంటూ సాక్షాత్తు ఆయన అన్న అయిన కొండలరావు చంద్రబాబుని గట్టిగా కోరారు. తనకు టికెట్ ఇవ్వాలని కూడా వినతి చేశారు. కేడర్ అంతా అప్పలనాయుడుకు వ్యతిరేకంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయినా సరే అప్పలనాయుడుకే టీడీపీ టికెట్ ఇచ్చేసింది. దాంతో కొండలరావు ఇపుడు తిరగబడుతున్నారు. 
ఏకంగా పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తన తమ్ముడినే ఓడిస్తానంటున్నారు. ఈ పరిణామాలు సజహంగానే వైసీపీకి కలసివచ్చెలా ఉన్నాయి. ఇక్కడ సీనియర్ నేత బొత్స సోదరుడు అప్పలనరసయ్య పోటీలో ఉన్నారు. ఇప్పటికే బలంగా ఉన్న వైసీపీ టీడీపీలో లుకలుకలుతో మరింత గెలుపు ధీమాను ప్రదర్శిస్తోంది.  ఓ విధంగా ఇది టీడీపీకి షాక్ గానే చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: