తిరుపతి ఈ నియోజకవర్గం నుంచే చిరంజీవి ఘన విజయం సాధించారు. అయితే చిరంజీవి రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన విజయం సాధించారు. అయితే భూమన చేసిన వివిధ పొరపాట్లతో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రికార్డుస్థాయి మెజారిటీతో తిరుపతి సీటును గెలుచుకుంది. అలా గెలిచిన నేత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ పోటీచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకపోవడంతో.. ఆమె రికార్డు స్థాయి మెజారిటీతో నెగ్గారు.

Image result for tdp and janasena

ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు : సుగుణమ్మకు ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కడం అన్నింటికన్నా పెద్ద విశేషం. భర్త మరణంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉండే వయసు కూడా కాదు ఆమెది. అప్పుడంటే ఏదో సానుభూతి కోసం అవకాశం ఇచ్చారు, ఇప్పుడు తిరుపతి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు మార్చడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమెకే బాబు అవకాశం ఇచ్చారు. జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం ప్రకారమే.. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించిందనే మాట స్థానికంగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచినే వినిపిస్తూ ఉంది.

గ్రౌండ్ రిపోర్ట్ః అక్కడ టీడీపీది థర్డ్ ప్లేసే!

ఒకదశలో పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీచేసే ఆలోచన చేయడంతో, తెలుగుదేశం పార్టీ ముందుగానే ఇక్కడ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించింది. సుగుణమ్మకు తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు, క్యాడర్ సహకరించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. జనసేన తరఫు నుంచి చదలవాడ కృష్ణమూర్తికి టికెట్ ఖరారు అయ్యింది. సామాజికవర్గం బలంరీత్యా ఇక్కడ జనసేన పార్టీ బలంగా కనిపిస్తూ ఉంది. బలిజల ఓట్ల గణనీయంగా ఉన్నాయి. అవే జనసేనను బలంగా నిలుపుతూ ఉన్నాయి.అయితే తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనం అయినా.. ఎంతోకొంత ఓటు బ్యాంకును అయితే పొందుతుంది. తెలుగుదేశం మూడోస్థానానికి పరిమితం కావడం ఖాయమే అయినా.. ఆ పార్టీ ఏ మేరకు ఓట్లను చీల్చుతుంది అనేదాన్ని బట్టి మిగతా ఇద్దరి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక భూమన నష్ట నివారణ చర్యలు అయితే గట్టిగానే చేపట్టాడు. పార్టీ గాలి ఉందంటే మాత్రం భూమన విజయం సాధించినట్టే. త్రిముఖపోరు కూడా భూమనను విజేతగా నిలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: