శ్రీకాళహస్తిలో ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని బరిలోకి దించడమా, లేక ఎస్సీవీ నాయుడును బరిలోకిదించడమా అనే విషయంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా కసరత్తు చేశారు.  బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పోటీచేయాలని.. ఆయన తనయుడు సుధీర్ రెడ్డి వద్దని చంద్రబాబు నాయుడు బాగా ఒత్తిడి చేశారట. గోపాలకృష్ణ అయితేనే గెలుపు అవకాశాలున్నాయని, తనయుడికి అయితే అవకాశాలు లేవని బాబు వాపోయినట్టుగా తెలుస్తోంది. అయితే బొజ్జల కుటుంబం మాత్రం వెనక్కు తగ్గలేదు. పట్టుబట్టి సాధించుకుంది.  చంద్రబాబు నాయుడు బొజ్జల కుటుంబానికి ఎందుకు తలొగ్గారనేది ఇప్పటికీ మిస్టరీగా ఫీలవుతున్నారు స్థానిక టీడీపీ నేతలు.

గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః శ్రీకాళహస్తి

ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే… నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు మార్మోగుతూ ఉంది. గత ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్ల తేడాతో ఓడారు మధుసూదన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఈయన బాగా కష్టపడ్డారు. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపు కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించిన ఎస్సీవీ నాయుడు చివరకు వెనక్కుతగ్గాల్సి వచ్చింది. టికెట్ ఖరారు అయ్యిందనుకున్న వ్యక్తికి చివర్లో హ్యాండ్ ఇవ్వడం సహజంగానే అసహానాన్ని కలిగించి ఉండవచ్చు.-దీంతో ఆయన సహకరిస్తారా? అనేది ప్రశ్నార్థకమే. ఆయనకు ఎమ్మెల్సీ హామీని ఇచ్చారట.

Image result for sri kalahasti railway station

దీంతో ఆయన పైకైతే తెలుగుదేశానికే మద్దతు అని అంటున్నారు. ఇక జనసేన తరఫున కూడా ఇక్కడ అభ్యర్థి రంగంలో ఉండటం ఖాయమైంది. బలిజల జనాభా రీత్యా ఇక్కడ ఆ పార్టీ కొద్దో గొప్పో ఓట్లను  చీల్చే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి గట్టిగా పని చేసుకోవడం ఆ పార్టీకి  సానుకూలాంశాలు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పోటీ చేసి ఉంటే ఆ కథ వేరు, ఆయన తనయుడు రంగంలోకి దిగడం వేరే కథ అని స్థానికులు అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. మొత్తం శాంపిల్స్ లో దాదాపు 55 శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై శాతం వరకూ అనుకూలంగా ఉన్నా, జనసేన నాలుగైదు శాతం ఓట్లను చీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్సీవీ నాయుడు అనుచరగణం మాత్రం అంత ఉత్సాహంగా లేరు. నాయుడుకు టికెట్ దక్కకపోవడంతో వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేయడానికి అంత ఉత్సాహంగా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: