ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీల అధినేతలు తమతమ నియోజకవర్గాల్లో వారి నామినేషన్లు వేశారు. అయితే తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడిస్తూ అఫిడవిట్లు సమర్పించారు. ముగ్గురి అఫిడవిట్లలోనూ ఆసక్తికర విషయాలు చర్చనీయాంశం అయ్యాయి.మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన అఫిడవిటిలో తన ఆస్తులు కేవలం 20 కొట్లే ఉండటం విశేషం. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కు 33 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే వీటి అన్నిటికంటే అందరిని ఆకర్షించే అంశం ఏంటంటే జగన్ అఫిడవిటిలో అందించిన వివరాలే. ఇప్పుడే ఇవే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జగన్ ఏకంగా 47 పేజీల అఫిడవిటినీ సమర్పించాడు. ఇందులో 31 కేసుల గురించి ప్రస్తావన ఉండటం, దానిని సోషల్ మీడియాలో హైలెట్ చేసి తన వ్యతిరేకులకు మంచి ఆయుధం దొరికట్టు అయ్యింది. ట్విట్టర్ లో ఏకంగా "జగన్ కరప్షన్ అఫిడవిటి", "జగన్ క్రిమినల్ అఫిడవిటి"," జగన్ కరప్షన్ కింగ్" అంటూ  హ్యాష్ ట్యాగ్స్ తో హల్ చల్ చేస్తు ట్రెండింగ్ లో ఉంచారు. నిన్న ఈ హ్యాష్ ట్యాగ్స్ మీద వేల సంఖ్యలో ట్వీట్ల వర్షం కురుస్తుంది. ఇదే ఒక ఎత్తు అయితే కామెడీ మీమ్స్ తో చెలారిగిపోతున్నారు.

ఇందులో ముఖ్యంగా "జులాయి" మూవీలో జైల్లో ఉన్నప్పుడు సీన్ ను ముడిపెడుతూ చేసిన మీమ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. నాకో బస్తా పేపర్లు, పెన్నుల కట్ట కావాలని జగన్ అడిగేట్లు. ఎందుకు ఆత్మకకథ రాస్తావా అని ప్రశ్నిస్తే. కాదు నామీదున్న కేసుల వివరాలు రాయాలి అని జగన్ సమాధానమిస్తున్నట్లు ఈ మీమ్ రూపొందించారు.ఇంకా ఇలాంటి కామెడీ మీమ్స్, జోకులు బోలెడన్ని తయారయ్యాయి జగన్ అఫిడవిట్ మీద. జగన్ ప్రచారం ఉద్ధృతంగా సాగుతన్న సమయంలో మిగతా విషయాలన్నీ పక్కకు వెళ్లిపోయి జగన్ అఫిడవిట్ మీద డిస్కషన్ నడుస్తుండటం వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లకు ఇబ్బందికరంగానే మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: