రాజ‌ధాని జిల్లా కృష్ణాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పెడ‌న‌. స‌ముద్ర‌ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌త్స్య‌కార వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదేస‌మ‌యంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా ఇక్క‌డ ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కాపుల బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ది ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే. దీంతో వీరికి ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో ఒక‌సారి కాంగ్రెస్‌, మ‌రోసారి టీడీపీ విజ‌యం సాదించాయి. ఇక‌, ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డిన ఇద్ద‌రు నాయ‌కులు కూడా ఇప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున పోరాడి విజ‌యం సాధించిన జోగి ర‌మేష్‌కు ఇప్పుడు వైసీపీ టికెట్ కేటాయించారు. 


ఇక‌, ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కాగిత వెంక‌ట్రావు.. తాను త‌ప్పుకొని త‌న కుమారుడు.. కాగిత వెంక ట కృష్ణ ప్ర‌సాద్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఇక్క‌డ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫు న స‌త్తినేని వెంక‌ట‌రాజు, జ‌న‌సేన త‌ర‌ఫున అంకెం శ్రీనివాస్‌, బీజేపీ త‌ర‌ఫున మ‌ట్టా ప్ర‌సాద్‌ పోటీ చేస్తున్నారు. అయితే, ప్ర‌ధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్యే ఉంటుంది. పైగా న‌వ‌యువ‌కుడుగా కాగిత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్ ఆక‌ర్ష‌ణ గా ఉన్నారు. ఇక‌, సీనియ‌ర్ నాయ‌కుడు, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి మూల‌ను చ‌దివిన నాయ‌కుడుగా జోగి ర‌మేష్ త‌ల‌ప‌డు తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య అప్పుడే మాట‌ల తూటాలు కూడా పేలుతున్నాయి. 


అభివృద్ధి విష‌యంలో ఇరువురు నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు కూడా చేసుకుంటున్నారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన నువ్వు ఏం చేశావ‌ని జోగిని ప్ర‌శ్నిస్తున్నారు. 2014లో నువ్వు టీడీపీ త‌ర‌ఫున గెలిచి ఏం చేశావ‌ని కాగిత‌ను జోగి ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, బ‌లాబ‌లాల విష‌యానికి వ‌స్తే.. టీడీపీకే ఎడ్జ్ క‌నిపిస్తోంది. పైకి మాత్రం వైసీపీకి జోష్ ఉన్నట్టుగా క‌నిపిస్తున్నా.. వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రంఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీత‌ర‌ఫున పోటీ చేసిన కాపు నాయ‌కుడు, ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు సాధించిన బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. దీంతో కాపుల ఓటింగ్ టీడీపీకి సానుకూలంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో కాగిత త‌న కుమారుడుని నిల‌బెట్ట‌డం ద్వారా యువ‌త‌రాన్ని త‌న వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. జోగి కూడా బ‌లంగానే ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సంప్ర‌దాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు త‌న‌వైపే ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు. దీంతో పెడ‌న పోరులో కాగిత గెలిచినా.. జోగి గెలిచాన‌.. వంద‌ల ఓట్ల తేడాలోనే ఉంటుం


మరింత సమాచారం తెలుసుకోండి: