రాజ‌ధాని జిల్లాగా ఉన్న కృష్ణాజిల్లాలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గ‌య్యపేట. పారిశ్రామికంగా అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆన‌వాల‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు ఎదుర‌య్యే ప్ర‌ధాన స‌మ‌స్య‌.. ఈ నియ‌జ‌క‌వ ర్గం లో ఏర్పాట‌య్యే ప‌రిశ్ర‌మలే! ఇక్క‌డ అభివృద్ధి జ‌ర‌గాల‌ని కోరుతున్న జ‌నాభాతోపాటు.. ఈ అభివృద్ధి కార‌ణంగా వెల్లువెత్తుతున్న కాలుష్యాన్ని త‌రిమికొట్టాల‌నే డిమాండ్ కూడా మ‌రోప‌క్క వినిపిస్తోంది. ఇక‌, ఇక్క‌డ నుంచి టీడీపీ వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది. పార్టీ ఆవిర్భావం త‌ర్వాత కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే ఇక్క‌డ ఓట‌మి చ‌విచూసిన ఈ పార్టీ గ‌ట్టిపునాదులే వేసుకుంది. 


ఇక‌, ఇక్క‌డ కాంగ్రెస్‌కు కూడా అంతే రేంజ్‌లో సానుభూతి ప‌రులు కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. 1999, 2004లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన సామినేని ఉద‌య‌భాను భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను సంపాయించుకున్నా.. నిల‌బెట్టుకోలేక పోయార‌నే అప‌వాదు ఉంది.  ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో అంటే 2009, 2014లోనూ ఇక్క‌డ నుంచి శ్రీరాం రాజ‌గోపాల్ ఉర‌ఫ్‌.. శ్రీరాం తాత‌య్య వ‌రుస విజ‌యాలు సాధించారు. టీడీపీ అభ్య‌ర్థిగా గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డంతోపాటు సామాజిక వ‌ర్గం బ‌లం కూడా ఆయ‌న సొంతం . ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ మ‌రోసారి తాత‌య్య‌కే టికెట్ కేటాయించింది. 


ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య భాను పోటీ చేస్తున్నారు. అదేవి ధంగా కాంగ్రెస్ త‌ర‌ఫున క‌ర్నాటి అప్పారావు, జ‌న‌సేన త‌ర‌ఫున ధ‌ర‌ణికోట వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీజేపీ అభ్య‌ర్థిగా శ్రీకాంత్ బ‌రిలోకి దిగారు. అయితే, ప్ర‌ధానంగా పోటీ మాత్రం శ్రీరాం వ‌ర్సెస్ సామినేని అనే రేంజ్‌లో సాగుతోంది. ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు సాదించిన రాంతాత‌య్య‌పై కొంత వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అభివృద్ధి విష‌యంలో ఆశించిన రేంజ్‌లో ముందుకు సాగ లే దని, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా ఓ మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే ప‌నులు చేస్తుంటాడ‌నిఆయ‌న‌పై ప్ర‌జ‌ల‌లో నిశ్చితాభిప్రాయం ఉంది. 


ఇక‌, వైసీపీ అభ్య‌ర్థి సామినేనిపై సింప‌తి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వ‌రుస ఓట‌ములు, ప్ర‌జ‌ల్లో ఉండ‌డం, స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తార‌నే పేరు ఉండ‌డం వంటివి ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ్గ‌య్య‌పేట పోరు భారీ స్థాయిలోనే ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌, ఇద్ద‌రూ కూడా ఆర్థికంగా బ‌లంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: