Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:35 am IST

Menu &Sections

Search

గుంటూరు పార్లమెంట్ పంతం: ' గ‌ల్లా ' జోరుకు ' మోదుగుల ' బ్రేక్ వేస్తాడా!

గుంటూరు పార్లమెంట్ పంతం: ' గ‌ల్లా ' జోరుకు ' మోదుగుల ' బ్రేక్ వేస్తాడా!
గుంటూరు పార్లమెంట్ పంతం: ' గ‌ల్లా ' జోరుకు ' మోదుగుల ' బ్రేక్ వేస్తాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మొన్నటివరకు ఒకే పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారడంతో గుంటూరు పార్లమెంట్‌ పోరు రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన గల్లా జయదేవ్ మరోసారి  తెదేపా నుండి బరిలోకి దిగుతుండగా…మొన్నటివరకు తెదేపాలో ఉన్న మోదుగుల వేణు గోపాల్‌రెడ్డి వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో గుంటూరులో ఇద్దరు అభ్యర్ధులు ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే ఇక్కడ జనసేన ఓ బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపింది కానీ...ప్రధాన పోటీ మాత్రం తెదేపా, వైకాపాల మధ్యే ఉండనుంది. గత ఎన్నికల్లో  గల్లా జయదేవ్ గుంటూరు నుండి బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన తొలి నాళ్లలో స్థానికంగా అందుబాటులో లేరన్న అపవాదు మూటగట్టుకున్న జయదేవ్‌.. క్రమేపీ అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. 


ఇక స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లస్. ప్రత్యేక హోదా అంశంతో పాటు జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలను పార్లమెంట్‌లో చర్చించి ఆయన తన ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నారు. ఇక ఆర్ధికంగా జయదేవ్ పరిస్తితి అందరికీ తెలుసు అలాగే సూపర్ స్టార్ మహేశ్ అభిమానుల మద్ధతు కూడా జయదేవ్‌కి పుష్కలంగానే ఉంది. కానీ స్థానికేతరుడు అనే ముద్ర ఆయన మీద ఇంకా ఉంది. నాయకులని పెద్దగా సమన్వయం చేసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వైకాపా నుంచి మోదుగుల పోటీ చేయడంతో జయదేవ్ విజయం అంత సులువు కాదనే అర్ధమవుతుంది. 2009లో నరసారావుపేట పార్లమెంట్, 2014లో గుంటూరు వెస్ట్ నుంచి మోదుగుల తెదేపా తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 


అయితే చివరికి తెదేపాతో తెగతెంపులు చేసుకుని జగన్ చెంతకి చేరి...ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోదుగులకి గుంటూరులో ఫుల్ క్రేజ్ ఉంది. కార్యకర్తలతో, ప్రజలతో మమేకం అవడం, పోల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ధిట్ట కావడం మోదుగులకి ప్లస్. అయితే అయిదేళ్లుగా ఎమ్మెల్యేగా పెద్ద పనులు చేయలేదని ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇక ఇక్కడ తెదేపా చాలా బలంగా ఉంది. అటు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన తర్వాత  గల్లాకి క్రేజ్ ఎక్కువ ఉండటం మోదుగులకి మైనస్. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలో గుంటూరు వెస్ట్, ఈస్ట్, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 


అయితే గత ఎన్నికల్లో మంగళగిరి, ఈస్ట్ నియోజకవర్గాలు తప్ప అన్నీ చోట్ల తెదేపా గెలిచింది. అయితే ఈసారి మంగళగిరి, పొన్నూరు, తెనాలి, వెస్ట్ నియోజకవర్గాల్లో తెదేపాకి కొంత ఎడ్జ్ ఉండగా..ఈస్ట్‌లో వైకాపాకి ఉంది. అటు తాడికొండ, ప్రత్తిపాడులో హోరాహోరీ ఫైట్ జరగనుంది. ఇక ఈ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో 15 లక్షల మంది ఓటర్లుంటే ఇందులో కమ్మ, కాపు, ముస్లింల ఓట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇంచుమించు 9 లక్షల మంది ఓటర్లు ఈ సామాజిక వర్గాల నుండే ఉన్నారు. అలాగే రెడ్డి వర్గం వారు లక్షకు పైగా ఉన్నారు. బీసీలు రెండు లక్షల మంది, ఎస్సీలు మరో రెండు లక్షల మంది వరకు ఉన్నారు. ఇతరులు మరో లక్ష మంది ఉన్నారు. మరి చూడాలి మళ్ళీ గల్లాను విజయం వరిస్తుందో.. లేక మోదుగులకు ప్రజలు పట్టం కడతారో..? 


guntur-galla-jayadev-modugula-venu-gopal-reddy-ap-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో టాప్ బెట్టింగ్ హాట్ సీట్ ఇదే
ఇండియాలో భారీగా త‌గ్గిన కండోమ్స్ వాడ‌కం... దిమ్మ‌తిరిగే రీజ‌న్‌
హిందూపురంలో 9 సెంటిమెంట్‌నే న‌మ్ముకున్న బాల‌య్య‌
మ‌రో సినిమా జంట విడాకులు... పెళ్లి పెటాకులు..!
ఏపీలో సంచ‌ల‌నం.... టీడీపీకి గుండు సున్నాయే... ఒక్క సీటూ రాదా..!
ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో ఆ మంత్రికి ఓట‌మి ఖాయం..
జ‌గ‌న్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రి కోసం మూడు ముక్క‌లాట‌...
డిసెంబ‌ర్ 23 ముహూర్తం... తెలుగు మీడియాలో మూత‌ప‌డే పేప‌ర్లు, ఛానెల్స్ ఇవే..
స్వామి ముద్దు.... శివ వ‌ద్దంటోన్న తార‌క్‌
గుంటూరులో ' గ‌ల్లా ' కొంప ముంచింది ఎవరు...
స్టూడెంట్స్‌తో కారులోనే... కాలేజ్‌లోనే బ‌రి తెగించిన లేడీ లెక్చ‌ర‌ర్
రిలీజ్‌కు ముందే సాహోరే ' సాహో ' ... ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డు
మంత్రి ' గంటా ' ఓడిపోతున్నాడా.... విశాఖ నార్త్‌లో బీజేపీ ఎమ్మెల్యే ట్విస్ట్‌
జ‌గ‌న్‌కు సొంత బంధువులే వెన్నుపోటా...!
తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఓడిపోయే సీట్లు ఇవే
జ‌న‌సైన్యం ఛ‌లో భీమ‌వ‌రం... రీజ‌న్ ఇదే
బాబుకు కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ ముందే ప్యాక్...
బాబోరి పని కేంద్రంలోనూ పాయే... రాష్ట్రంలోనూ పాయే: అరెస్టయ్యే అవకాశం మిగిలి పోయే..!
ఎన్టీఆర్ హీరోయిన్‌తో బ‌న్నీ రొమాన్స్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా..
వైసీపీ గెలిస్తే.. బాబు ఇలా కూడా వేధిస్తారా..!
వైసీపీ గెలిస్తే.. బాబు ఇలా కూడా వేధిస్తారా..!
' మ‌హ‌ర్షి ' 11 డేస్ క‌లెక్ష‌న్స్‌... మ‌హేష్‌కు బ్రేకుల్లేవ్‌
ల‌గ‌డ‌పాటికి ఎస‌రెట్టేసిన త‌మ్ముడి స‌ర్వే... ఏ స‌ర్వే నిజం
ఆ సీటులో ప‌వ‌న్ ఓడిపోతాడ‌ని బెట్టింగులే బెట్టింగులు..!
బాల‌య్య‌పై రోజా గెలుపు...ప‌క్కా రాసిపెట్టుకోవ‌చ్చు
టీడీపీలో ఈ బ్యాచ్‌కు రిటైర్‌మెంట్‌
చంద్ర‌బాబు ఐర‌న్ లెగ్ మ‌హిమ‌... వాళ్లు కూడా బ‌లైపోయారు
మెగా హీరోల ఇగోకు చెక్ ప‌డిన‌ట్టేనా..!
బాల‌య్య గెలుస్తున్నాడు... ఇద్ద‌రు అల్లుళ్లు ఓడుతున్నారు... స‌ర్వే చెప్పింది ఇదే
వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనే నేను... ఏ స‌ర్వేలో వైసీపీకి ఎన్ని సీట్లంటే
స‌ర్వే ఏదైనా ఏపీ సీఎం జ‌గ‌నే... ఏ స్థాయి ప్ర‌భంజ‌నం అంటే..
ఏపీలో ' ప‌వ‌న్ ప‌వ‌ర్ ' డిజాస్ట‌రే... తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్‌
ల‌గ‌డ‌పాటి స‌ర్వే: జ‌గ‌న్ ఫ‌స్ట్‌.... ప‌వ‌న్ సెకండ్‌... బాబు లాస్ట్‌
పీపుల్ ప‌ల్స్ స‌ర్వే: ఏపీ జ‌గ‌న్‌దే... జ‌నసేన‌కు టాప్ సీట్లు
సీపీఎస్ ఎగ్జిట్ పోల్‌: వైసీపీకి బంప‌ర్ మెజార్టీ
ఇండియా టుడే స‌ర్వే... ఏపీలో వైసీపీ ప్ర‌భంజనం
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.