చంద్రబాబు నాయుడుకు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ బాబు మాటలు మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. విస్తుపోవటం జనాల వంతవుతుంది. ఎన్నికల ప్రచారంలో ఆయన చెబుతున్న మాటలు గమనిస్తే... చంద్రబాబునాయుడు మరీ ఇంత అసమర్థుడా, ఇంత బలహీనమైన నాయకుడా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును మించిన ఎమ్మెల్యేలు ఇన్నాళ్లూ ఆయన పార్టీలో ఉన్నారా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది.

Image result for chandra babu

గుంటూరు నగరంలో చంద్రబాబునాయుడు ప్రచార సభ నిర్వహించారు. ఆ సభలో మాట్లాడుతూ... గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈ అయిదేళ్లలో సరిగా అభివృద్ధి చేయలేకపోయానని చంద్రబాబునాయుడు ఈ సభలో చెప్పారు. తాను చేయదలచుకున్న అభివృద్ధికి ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారంటూ అందుకు కారణాలను ఇతరుల మీదికి నెట్టేసేందుకు ప్రయత్నించారు.విషయం ఏంటంటే... గుంటూరు పరిధిలో... రాజధాని పేరిట భూములు లాక్కుని.. అద్భుతాలు సృష్టించేస్తున్నానంటూ ప్రకటనలు చేయడం మినహా... ఈ ప్రాంతంలో వాస్తవంగా జరిగిన అభివృద్ధి చాలా తక్కువ. 

Image result for chandra babu

ఇధే అసంతృప్తితో తెదేపా ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి... వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు.అలాగే ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు కూడా ఇప్పుడు జనసేనలో ఉన్నారు. వీరిద్దరినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ‘నేను ఎంతో అభివృద్ధి చేయదలచుకుంటే.. గుంటూరు నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారంటూ’ వారి మీద ఆరోపణలు గుప్పించారు.అయినా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అభివృద్ధి చేయదలచుకుంటే... ఎమ్మెల్యేలు అడ్డుపడడం సాధ్యమేనా? చంద్రబాబు ఇలాంటి బుకాయింపు మాటలు ఎందుకు చెబుతున్నట్లు? అని ప్రజలు విస్తుపోతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అభివృద్ధి కూడా చేయలేనంత దీనస్థితిలో ఉన్నాడా అని  జనం అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: