వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పట్టున్న "భోపాల్‌" లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ను రంగస్థలం మీదకి తీసుకు రావటంతో ఆయనకు దీటైన అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ను పోటీలో నిలపాలని భావిస్తోంది బిజేపి. వీరిద్దరూ ప్రత్యర్ధులుగా తలపడితే ఆ పోరు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల నడుమ బ్యాలెట్‌ పోరు ఆసక్తి కరంగా మారనుందని అంటున్నారు. 
digvijay singh Vs Sivaraj singh chauhan కోసం చిత్ర ఫలితం
మరో వైపు దిగ్విజయ్‌ సింగ్‌ పై పోటీకి మాలెగావ్‌ పేలుళ్ల కేసులో అభియోగాలు ఎదుర్కొని ఇటీవలే న్యాయస్ధానం నుంచి ఊరట పొందిన సాధ్వి ప్రగ్య ఠాకూర్‌ ఆసక్తి కనబరు స్తున్నారు. భోపాల్‌ స్ధానాన్ని గత మూడు దశాబ్ధాలుగా బీజేపీ కైవసం చేసుకుంటూవస్తోంది. 1984 లో చివరి సారిగా కాంగ్రెస్‌ నేత శంకర్‌ దయాళ్‌ శర్మ ఆ పార్టీ తరపున ప్రాతి నిధ్యం వహించారు. అప్పటి నుంచి భోపాల్‌ బీజేపీ ఖాతా లోనే కొనసాగుతూవస్తుంది. 
digvijay singh Vs Sivaraj singh chauhan  కోసం చిత్ర ఫలితం
1989నుంచి బీజేపీకి చెందిన సుశీల్‌ చంద్రవర్మ వరుసగా మూడుసార్లు భోపాల్‌ నుంచి ఎన్నికయ్యారు. 1999 లో భోపాల్‌ నుంచి నెగ్గిన ఉమా భారతి ముఖ్యమంత్రిగా అధి కార పగ్గాలు చేపట్టిన అనంతరం పార్లమెంట్‌ స్ధానం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం భోపాల్‌ నుంచి బీజేపీ సభ్యుడు అలోక్‌ సంజార్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
digvijay singh Vs Sivaraj singh chauhan  కోసం చిత్ర ఫలితం
మరోవైపు భోపాల్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో దిగడం, లోక్‌సభ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ శాసనసభ్యులు విజయం సాధించి ఉండటంతో డిగ్గి రాజా (దిగ్విజయ్‌) కు దీటైన అభ్యర్ధి వైపే బీజేపీ మొగ్గు చూపుతోంది. భోపాల్‌ నుంచి పోటీ చేసేందుకు మేయర్‌ అలోక్‌ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి వీడీ శర్మలను పరి శీలిస్తున్న బీజేపీ దిగ్విజయ్‌ సింగ్ రాకతో దిగ్గజ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నే బరిలో దింపాలని యోచిస్తోంది. అప్పుడే పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. ఇద్దరూ హెమా హేమీలే. కాని శివరాజ్ సింగ్ ప్రజల మనసుల్లో నుంచి ఉద్భవించిన నేతగా అగ్రపథాన ఉన్నారు. 

digvijay singh Vs Sivaraj singh chauhan కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: