తెలుగు సినీ సీమలో నటులు రాజకీయాల్లోకి రావడం అన్నది కొత్త కాదు. సాక్ష్తాత్తు అన్న నందమూరి తారకరామారావు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆయన వరసలో అనేకమంది రాజకీయాల్లోకి వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే  సినిమా రాజకీయం ఒక్కటైపోయాయి.


విషయానికి వస్తే వెటరన్ యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పొలిటికల్ రీ ఎంట్రీ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన రెండు రోజుల క్రితం తన విద్యా సంస్థలకు ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ ఇవ్వలేందటూ ధర్నా చేసి అధికార పార్టీకి షాక్ తినిపించారు. ఈ నేపధ్యంలో టీడీపీకి చెందిన కుటుంబరావు మోహన్ బాబును రెచ్చగొట్టేలా హాట్ కామెంట్స్ చేశారు. ముసుగులో గుద్దులాట ఎందుకు, బయటకు వచ్చి రాజకీయాలు చేయాలంటూ సవాల్ విసిరారు. దీనికి తోడు మోహన్ బాబు తన విద్యా సంస్థల కోసం విరాళాలు తీసుకుని లెక్కలు చెప్పడం లేదంటూ కూడా ఘాటుగా విమర్శించారు.


ఇపుడు ఇవే మోహన్ బాబులోని మాన ధనున్ని తట్టి లేపాయని అంటున్నారు. నిజానికి మోహన్ బాబు ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. ఆయనకు జగన్ కుటుంబంతో వియ్యం కూడా ఉంది. అడిగితే జగన్ సైతం కాదనే పరిస్థితి ఉంది. అయితే ఎందుకో ఆయన మిన్నకుండిపోయారు. ఇపుడు టీడీపీ సవాళ్ళు చూసిన తరువాత మోహన్ బాబు తన సత్తా చూపాలని భావిస్తున్నారుట.


తాను వైసీపీలో చేరి వూరూరా ప్రచారం చేస్తే అది వైసీపీ విజయానికి మరింతగా ఉపయోగపడడమే కాకుండా. చంద్రబాబు కూసాలు కూడా కదిలిపోతాయని ఆయన భావిస్తున్నారుట. తనని చిన్న చూపు చూసి ఇగో దెబ్బ తీసిన టీడీపీని, దాని అధినేత చంద్రబాబు ని వదలకూడదని మోహన్ బాబు కసి మీద ఉన్నారని టాక్. అదే జరిగితే ఏపీలో బాబుకు మరో మారు బ్యాండ్ బాజావే అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: