తెలుగుదేశం పార్టీకి పట్టు కొమ్మలు ఆ జిల్లాలు. అక్కడ ఆరు నూరైనా ఫలితం తారు మారు కాదు. ఎపుడో సునామీ వస్తే తప్ప అక్కడ కోటలు చెక్కుచెదరవు. ఆ జిల్లాలే ఆలంబనగా టీడీపీ రాజకీయం మొత్తం సాగుతూ వస్తోంది. మరి ఆ జిల్లాలు ఇపుడు ఏంచేయబోతున్నాయి.


వైఎస్ జగన్ ఈ రోజు టీడీపీకి గుండె కాయల్లాంటి  జిల్లాలు ఐన గుంటూర్, క్రిష్ణాలలో ప్రచార సభలు నిర్వహించారు. మొత్తం మూడు సభల్లో జగన్ పాల్గొంటే ఒకదాన్ని మించి మరోటి సూపర్ హిట్ అయ్యాయి.  మొదట గుంటూర్ జిల్లా రేపల్లెలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. దాని తరువాత చిలకలూరిపేటలో జగన్ మీటింగ్ పెడితే అక్కడ మొత్తం జన సంద్రమైఅంది. చిత్రమేంటంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఇక్కడ వైసీపీ  తరఫున బీసీ మహిళ విడుదల రజనీ పోటీ చేస్తోంది. 


ఇక జగన్ మూడవ సభ క్రిష్ణా జిల్లా తిరువూర్లో నిర్వహించారు. ఇక్కడ  చూడాలి. జనమే జనంగా కనిపించింది సీన్ మొత్తం. జగనే షాక్ తిన్నారు ఆ వచ్చిన జనాన్ని చూసి. కనుచూపు మేరంతా జనమే నిడిపోయారంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇలా టీడీపీకి పట్టు కొమ్మలు, గత ఎన్నికల్లోనూ, అంతకు ముందు కూడా కొమ్ము కాసిన ఈ జిల్లాలలో జగన్నినాదం రీ సౌండ్ చేసింది ఇది దేనికి సంకేతం. ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా వస్తున్న ఈ స్పందన మారుతున్న జనాభిప్రాయమా అన్నది  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: