హిందూపురం నియోజక వర్గం ఈ బాగా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం. దానికి కారణం కేవలం బాలయ్య ఉండటం చేతనే. ఐదేళ్లు గడిచిపోయాయి. అప్పుడు బాలయ్యకు ఉండే క్రేజ్‌ను చూసి జనాలు ఓటేశారు. అయితే ఇప్పుడు బాలయ్య ఐదేళ్ల పనితీరు మీద ప్రజలు తీర్పును ఇవ్వబోతూ ఉన్నారు. బాలయ్య ఐదేళ్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తర్వాత కూడా హిందూపురంలో పెద్దగా మార్పు ఏమీ కనిపించదు. ప్రధాన రహదారులు కూడా అంతే అధ్వానంగా, ఇరుకుగానే ఉన్నాయి. ఇరవైయేళ్ల కిందట హిందూపురం ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. మెయిన్‌ టౌన్‌ను సుందరీకరించే ప్రయత్నాలు ఏమాత్రం జరిగినట్టుగా కనిపించవు.

Image result for balakrishna hindupur

అయితే జనావాస ప్రాంతాల్లో మాత్రం రోడ్లూ గట్రా బాగానేపడ్డాయి. ఇక నీటి సౌకర్యం విషయంలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా పల్లెల్లో ఈ కంప్లైంట్‌ తీవ్రంగా ఉంది. బాలకృష్ణ కొద్దోగొప్పో చేసిన అభివృద్ధి కూడా కేవలం టౌన్‌లోనే అని, పల్లెలను ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెబుతూ ఉన్నారు. స్థానికంగా ముస్లింల జనాభా గణనీయంగా ఉంది. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే ఘనీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈయనకంటూ ఒక వర్గం అయితే ఉంది. ఘనీ కూడా పోటీకి వెనుకడుగు వేయడంతో ఇక్బాల్‌ను తెచ్చి అభ్యర్థిగా ప్రకటించింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

Image result for balakrishna hindupur

ఒకవేళ నవీన్‌ నిశ్చల్‌, ఘనీలు.. తమ పూర్తి సహకారాన్ని ఇక్బాల్‌కు అందిస్తే ఆయన గట్టి అభ్యర్థి అవుతారు. వ్యక్తిగతంగా తమ తమ వర్గాలను కలిగి ఉన్న వారిరువురూ పూర్తి స్థాయిలో సహకరిస్తారా? అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. ఇక్బాల్‌ గెలిస్తే.. ఇక భవిష్యత్తులో తమకు అవకాశాలు ఉండవనే.. లెక్కలతో నిశ్చల్‌, ఘనీలు హ్యాండిస్తే.. బాలయ్య గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అలా కాకుండా.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని గట్టిగా అనుకుని నవీన్‌ నిశ్చల్‌, అబ్ధుల్‌ ఘనీలు ఇక్బాల్‌కు సహకరం అందిస్తే హిందూపురంలో సంచలనం నమోదు కావొచ్చు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆర్థికంగా అంత సత్తా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. బాలకృష్ణ ఆర్థికశక్తి ముందు ఇక్బాల్‌ సరిపోతాడా? అనేది చాలా సులభంగా అర్థం అవుతున్న విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: