హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారంటూ పవన్  ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో సెటిలైన సినీజనం తీవ్ర పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నారు. మొన్న పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్‌ను ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.  

andhra people beating in hyderabad says pawan కోసం చిత్ర ఫలితం


హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉంటున్న సెటిలర్ల జీవితాలతో రాజకీయం కోసం ఆడుకోవద్దని చిన్నకృష్ణ హితవు పలికారు.ఒకవేళ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా స్పందించి మాపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ రక్షిస్తాడా ? లేకపోతే ఆయన అన్న నాగబాబు వచ్చి కాపాడుతారా అని ప్రశ్నించారు. 

pawan chinni krishna కోసం చిత్ర ఫలితం

రంగాను హత్య చేసిన విజయవాడలో జగన్ గురించి మాట్లాడతావా అని నిలదీశారు. కాపులంటే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని, తాము కూడా కాపులమేనని ఈ పేర్కొన్నాడు. తాను చిరంజీవి ఇంటికి వెళితే కనీసం భోజనం, టిఫిన్ కూడా పెట్టకుండా పంపించిన ఘనత చిరంజీవిదని ఆయనపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత చిత్రం

పవన్ కల్యాణ్ గురంచి తాను నోరు తెరిస్తే.. ఆయన నవరంధ్రాలు మూసుకోవాల్సి ఉంటుందని చిన్నికృష్ణ ఘాటుగా విమర్శించారు. తెలుగులో టాలెంట్ ఉన్న వారిలో అతి తక్కువ గౌరవించే వ్యక్తిగా పవన్ కల్యాణ్ నాకు తెలుసంటూ సెటైర్‌లు వేశారు. పాపం.. మొన్న  పోసాని, నిన్న చిన్నికృష్ణ.. నేడు ఇంకెవరో..  



మరింత సమాచారం తెలుసుకోండి: