రాజకీయాల్లో నెగిటివ్ పాలిటిక్స్ ఎంటరై చాలా కాలమే అయింది. జనం కూడా కొన్ని సార్లు అటువంటి పాలిటిక్స్ కి ఓటేశారు. విజయాలు కూడా అందుకున్న వారున్నారు. అయితే మితిమీరితే ఏదీ వర్కౌట్ కాదు. ఏదైనా  అసలు కొంత ఉంటే దాన్ని ఎంత చేసినా ఫలితం ఉంటుంది. ఏదీ లేకుండా శూన్యం నుంచి అద్భుతాలు చేయాలని ఆశపడితే మాత్రం భంగపాటే మరి.


ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు ఏడాదిగా నెగిటివ్ పాలిటిక్స్ నే బాగా నమ్ముకున్నారు. మోడీని బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలను ఓ వైపు చూస్తూనే తెలంగాణా ఎన్నికల తరువాత కేసీయర్ అన్న ఒకే ఒక మాట రిటర్న్ గిఫ్ట్ ను పట్టుకుని ఇప్పటికీ ఆయన్ని తిడుతూ రాజకీయం చేస్తున్నారు. ఇది జరిగి నాలుగు నెలలు అవుతున్న కేసీయర్ ని బాబు వదలడంలేదు. నిజానికి రిటర్న్ గిఫ్ట్ అన్న మాట కేసీయార్ కూడా మరచిపోయినా బాబు గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా జనంలో సానుభూతిని పొందాలని ఆయన ప్రయత్నం.


ఇక ఇక్కడ జగన్ని, కేసీయార్ని, మోడీని కలిపేసి పులిహోర వండేసి తాను అధికారమనే బిర్యానీ తీసుకుపోవాలని బాబు తెగ ట్రై చెసతున్నారు. అయితే ఆయన పాచికలు పారడం లేదు. ఎందుకంటే మోడీ గుంటూర్ సభ తరువాత బాబును పల్లెత్తు మాట అనలేదు. కేసీయార్ అయితే రిటర్న్ గిఫ్ట్ అన్న తరువాత ఇప్పటికీ బాబుని ఒక్క మాట కూడా అనలేదు. అయినా వారినే బూచిగా చూపిస్తూ ఎన్నికల గండం గట్టెక్కాలని బాబు చూస్తున్నారు. అది తెలిసే కేసీయార్ బాబుని అసలు పట్టించుకోవడం లేదు. ఓ వైపు బాబు  డోస్ పెంచేసి కేసీయార్ ని నానా మాటలు అంటున్నా సహనం పాటిస్తున్నారు. ఎందుకంటే తాను మళ్ళీ రెచ్చిపోతే అది బాబుకు అడ్వాంటేజ్ అవుతుందని.


అయితే బాబు మాత్రం వూరుకునేలా లేరు. ఇంకా కేసీయార్ని దారుణంగా తిట్టాలని డిసైడ్ అయిపోయారట. నామినేషన్ల విత్ డ్రా తరువాత ప్రచారంలో రెండవ అంకానికి తెర తీస్తారట. ఇపుడు ఏకంగా కేసీయార్ని నానా రకాల  మాటలతో చెడుగుడు ఆడుకుంటారట. గతంలో అనని మాటలను కూడా చేర్చి, కూర్చి కేసీయార్ని ఎలాగైనా ముగ్గులోకి లాగాలని బాబు చూస్తున్నారు. విసిగి కేసీయర్ రెచ్చిపోతే ఇక ఎన్నికల్లో ఎదురు ఉండదని, కేసీయార్ మాటలను చూపించి ఏపీలో ఎమోషనల్ సెగ పుట్టించాలని బాబు అండ్ కో తాపత్రయమట. మరి కేసీయార్ ఇపుడు పడిపోతారా. బాబు ట్రాప్ కి చిక్కుతారా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: