విశాఖ అర్బన్ జిల్లాలో మూడు సీట్లు ఉన్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే వీటి మీదనే ఇపుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది పందేలు కూడా కడుతున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను సీట్లు ఒక ఎత్తు. మిగిలిన సీట్లు మరో ఎత్తు అన్నట్లుగా ఈ జిల్లాలపైనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ మూడు సీట్లు హాట్ సీట్లు. అందులో ఒకటి టీడీపీకి కంచుకోట లాంతి భీమునిపట్నం. రెండవది విశాఖ ఉత్తరం అసెంబ్లీ సీటు, మూడవది గాజువాకలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సీటు. ఈ మూడింటిలో గెలుపు ఎవరిది అంటే ఇపుడే అంచనాకు ఎవరూ రాని పరిస్థితి ఉంది.


భీమిలీ విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటికి ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ గెలిచింది. ఓడినపుడు టీడీపీ తక్కువ మెజారిటీతో సీటు కోల్పోయింది. గెలిచినపుడు మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. మరి ఈ సీటు ఇపుడు ఎవరి పరం అవుతుందన్నది చర్చగా ఉంది. ఇక్కడ నుంచి బలమైన అభ్యర్ధిగా వైసీపీకి చెందిన అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఆయన అంగబలం, అర్ధబలం ముంది సరి సాటి ఎవరు అన్నది తేల్చుకోవడానికే టీడీపీకి పుణ్యకాలం గడచిపోయింది. మొత్తానికి మాజీ ఎంపీ సబ్బం హరిని పోటీలోకి దింపింది. అయితే హరి ఎంతవరఊ పోటీ అవుతారో చూడాలి. అయితే హరి కూడా పావులు బాగానే కదుపుతున్నారు. తన పాత పరిచయాలు తిరగతోడుతున్నారు. 


ఇక రెండవది విశాఖ ఉత్తరం సీటు. ఇక్కడ ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈ సీటు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గత ఇరవయ్యేళ్ళుగా టీడీపీ గెలిచింది లేదు. ఆ పార్టీ చివరి గెలుపు 1999 ఎన్నికల్లో. ఉత్తరం అసెంబ్లీ సీటు పూర్వపు నియోజకవర్గం అయిన విశాఖ 2గా ఉన్నపుడు టీడీపీ అభ్యర్ధిగా పిన్నిటి వరలక్ష్మి గెలిచారు. ఆ ఆ తరువాత రెండు సార్లు కాంగ్రెస్, ఒకమారు బీజేపీ ఇక్కడ విజయ బావుటా ఎగురవేశాయి. ఇపుడు ఇక్కడ పసుపు జెండా ఎగురవేయాలని మంత్రి గంటా రెడీ అయిపొయారు. అయితే సీన్ మాత్రం వేరేగా ఉంది. సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజు గారు కూడా ఐదేళ్ళలో బాగానే పాతుకుపోయారు. ఇక వైసీపీ అభ్యర్ధి కేకే రాజు కూడా చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతున్నారు. దాంతో మంత్రి గారు రాజకీయం ఎంతవరకూ చెల్లుబాటు అవుతుందో చూడాలి.


మూడవ సీటు గాజువాక. ఇక్కడ ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు బలం, బలగం ఫ్యాన్స్ మాత్రమే. పైగా ఇక్కడ కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ ధైర్యంతోనే పవన్ ఇక్కడ పోటీకి దిగిపోయారు. అయితే  పార్టీ నిర్మాణం లేకపోవడం జనసేనకు శాపంగా ఉంది. అలాగే,  ఆయన్ని నాన్ లోకల్ అంటూ అపుడే టీడీపీ ప్రచారం మొదలెట్టేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బలమైన నాయకుడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన మరో మారు గెలవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. ఆయన 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే 32 వేల ఓట్లు వచ్చాయి. 2014లో వైసీపీ తరఫున పోటీలో దిగితే 75 వేల ఓట్లు వచ్చాయి. ఇపుడు లక్ష ఓట్లు తనకు రావడం ఖాయం. నెగ్గడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. మరి గాజువాకలో పవన్ గెలుస్తారా లేదా అన్నది ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: