ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి తానేంటో నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

Image result for lokesh

ఇదే క్రమంలో వైసీపీ పార్టీ తరఫున నిలబడిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా రాబోతున్న ఎన్నికలలో నారా లోకేష్ పై గెలిచి వైసీపీ పార్టీ పవర్ ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానిక సమస్యలను లేవనెత్తుతూ ఎక్కడినుండో ఇక్కడికి వచ్చి అక్రమ నివాసంలో ఉంటున్నారంటూ నారా లోకేష్ కి నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలను వరుసగా వేస్టు సంచలనం సృష్టిస్తున్నారు.

Image result for lokesh alla rama krishna reddy

ముఖ్యంగా మంగళగిరిలో ఆక్రమించుకొన్న ఇల్లు గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అవినీతి మరియు నారా లోకేష్ రాజకీయ అజ్ఞానంపై మరియు ఆయన మాట తీరు పై..సెటైర్లు వేస్తున్నారు. తనపై నారా లోకేష్ పోటీ గురించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తావిస్తూ...నారా లోకేష్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై ఓడిపోతాడని ముందే తెలిసి చంద్రబాబు లోకేష్ కి ఉన్న ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయకుండా చేసి లోకేష్ యొక్క రాజకీయాన్ని తండ్రిగా భుజాన వేసుకుని నానా కష్టాలు పడుతున్నారు అంటూ చంద్రబాబు పై ఆయన కుమారుడు లోకేష్ పై వెటకారంగా మాట్లాడారు ఆర్ కె. ఏది ఏమైనా రాబోతున్న ఎన్నికలలో మంగళగిరిలో మళ్లీ ఎగిరేది వైసీపీ జండా అని పేర్కొన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: