ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి నేతల్లో ఉరుకులు పరుగులు మొదలైన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఏపిలో ప్రధాన పార్టీ నేతలు తమ ప్రసంగాలతో..వాగ్ధానాలతో ప్రజలను నానా రకాలుగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో..అన్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏపాల్ సందడి మరోలా ఉంది.  ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ నాయకులకు డిపాజిట్లు కూడా దక్కవని..వచ్చేది ప్రజాశాంతి పార్టీనని తానే సీఎం అవుతానని అంటున్నారు. 


ఆయనకు సంబంధించిన వీడియోలు..ఇంటర్వ్యూలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  కాకోపోతే అవి సీరియస్ గా కావు..నవ్వుకోవడానికే..అవును పాల్ చేస్తున్న ప్రచారం..ఆయన వింత ప్రవర్తన సోషల్ మీడియాలో నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉంటే..ఆన్‌లైన్‌లో తెల్లవారుజామున 3 గంటలకు సోషల్ మీడియాలో లైవ్ చేపట్టి ఎన్నికల నిబంధనను ఉల్లఘించారు.ఎన్నికల బరిలో ప్రజాశాంతి పోరాటం ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది? వంటి ప్రశ్నలను సంధిస్తూ, తన లక్ష్యాలు, ఎన్నికల వ్యూహాలపై లైవ్ ద్వారా వివరించారు. 


అయితే రాత్రి 10 గంటల తర్వాత పార్టీ అభ్యర్థులు ఎలాంటి ప్రచారాల్లో పాల్గొనడానికి వీల్లేదు.  కానీ పాల్ మాత్రం ఎన్నికలకు విరుద్దంగా ప్రచారం చేశారు.  ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేపట్టిన పాల్, అభిమానులకు కనెక్ట్ అయ్యేందుకే తాను అలా చేయాల్సి వచ్చిందంటూ సమర్థించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: