భారత రాజకీయ ఆశాసౌధాన్ని చేరాలంటే అతి దగ్గర మార్గం ఉత్తర ప్రదేశ్ ను పిడికిట్లోకి తీసుకోవటమే. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరి దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పై పడింది. దేశవ్యాప్తంగా అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్. 80 లోక్ సభ స్థానాలున్న ఈ రాష్ట్రం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో 71 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి పూర్తిగా స్వీప్ చేయాలని చూస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీజేపీకి ఆ అవ కాశం ఇవ్వకుండా తీవ్రాతితీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

bjp sweeps in UP కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటికే లోక్ సభ స్థానాల్లో విజయం సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ రకరకాలుగా ప్రచారం చేస్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. అటు ఎస్పీ-బీఎస్పీలు కలిసి ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో త్రిముఖ సమరం జరగనుంది. కాంగ్రెస్ ఒంటరిగా వెళ్తున్నా కొన్నిచోట్ల మాత్రం యూపీ-బీఎస్పీ కూటమి కి సపోర్టుగా వెళ్తున్నట్లు సమాచారం. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా తమ అభ్యర్థులను దించమని ఎస్పీ-బీఎస్పీలు ఒప్పందాన్ని చేసుకున్నాయి.

bjp sweeps in UP కోసం చిత్ర ఫలితం

ఇదిలా ఉండగా రాష్ట్రంలో కులాలను బట్టి ఓటు బ్యాంకు మారనుంది. కాంగ్రెస్-బీఎస్పీ-ఎస్పీలు కలిసి కులాల ఓట్లను సంపాదించాలని కసరత్తు చేస్తున్నాయి. కానీ వారు కలిసినా ఓట్లు రాబట్టే అవకాశాలు అనుమానమేనన్న సంకేతాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. బీజేపీ దుందుడుకు స్వభావానికి ప్రతిపక్షాలు తట్టుకోవడం లేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఒక వైపు ముఖ్యమంతి యోగి ఆధిత్యనాద్  చేస్తున్న ప్రక్షాళనకు తోడుగా మోడీ ప్రభంజనం రాష్ట్రంలో విపరీతంగా ఉండడంతో లోక్ సభ స్థానాలను చేజిక్కించుకునే అవకాశం ప్రతిపక్షాలకు వస్తుందా? ఋఆదా? అన్న చర్చ రసవత్తరంగా సాగుతోంది.

bjp sweeps in UP కోసం చిత్ర ఫలితం

గత ఎన్నికల్లో 71 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది అయితే సర్వేల ప్రకారం రాష్ట్రంలో బీజేపీకి 50కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. కానీ ఎస్పీ- బీఎస్పీ కూటమి వేస్తున్న ఎత్తులకు బీజేపీ పై-ఎత్తులు వేస్తూ ఓటు బ్యాంకును భారీగా బదిలీ చేసేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ- బీఎస్పీల కూటమిలో ఎవరు ముందుంటారో ఎన్నికల పలితాలే చెప్పాలి. నిరీక్షించటం మనకు తప్పదు.

bjp sweeps in UP కోసం చిత్ర ఫలితం 

మరింత సమాచారం తెలుసుకోండి: