ఎందరో త్యాగమూర్తులు, ఎందరో గొప్ప బలిదానాల వల్లనా స్వాతంత్య్రం అనే స్వప్నాన్ని నెరవేర్చుకున్నాము. కొన్ని వందల ఏళ్ల పోరాటం వల్లన వచ్చింది కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు ప్రజాస్వామ్యం కూడా. ప్రజాస్వామ్యం లేని స్వాతంత్య్రం వ్యర్థం లాంటిది. అయితే 75 ఏళ్ల స్వాతంత్య్రంలో నిజంగా మనం ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామా ...? దీనికి మనం ఖచ్చితంగా సమాధానం చెప్పగలమా .. నిజంగా మనకు ప్రజాస్వామ్యం ఉంటే అత్యంత ఘోరమైన నేరాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు చట్ట సభల్లో అడుగు పెడుతున్నారు. నిజంగా మనది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అయితే వారిని ఎందుకు చట్ట సభల్లో అడుగు పెట్టకుండా చేయలేకపోతున్నాము. నిజంగా మనది ప్రజాస్వామ్యం అయితే డబ్బు తీసుకోని ఎందుకు ఓట్లు వేస్తున్నాము.
Image result for voter
డబ్బు ఇచ్చిన ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ మీకు ఉచితంగా ఎందుకు ఇస్తున్నాడని ఏ పొద్దయినా ఆలోచించారా ... దానికి పది, వందల రెట్లు సంపాదించుకోవడానికి ...!
నాకు ఇప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. బీబీసీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో ప్రజాస్వామ్యమనేది కేవలం రాజ్యంగంలో మాత్రమే ఉంటుందని నిజంగా అది సాధ్యపడదని చెబుతాడు. నిజంగా అంబెడ్కర్ మాటలు గుర్తుకు తెచ్చుకుంటే నిజమే కదా అనిపిస్తుంది. ఓటు వేసే ముందు అతను నా కులమా .. నా సామజిక వర్గమా అని ఆలోచించినప్పుడే భారత దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టు లెక్క.
Image result for voter
ఇప్పుడు రాజకీయాలు అంటే డబ్బు, మందు అనే అర్ధం వస్తుందంటే దానికి కారణం ఎవరు పరిపాలించేవారు ... వీరు ఇలాంటి వారేనని తెల్సిన ఓట్లు వేసే ప్రజలా ... అరే ఎవరైనా కుర్రాడిని రాజకీయం గురించి అడిగితే మనకెందుకు రాజకీయాలంటారు ...కానీ నిన్ను పరిపాలించేది ... నీవు చేసే ప్రతి పనిని శాసించేది నువ్వు ఎన్నుకునే ప్రతినిధి. మనకందరికీ నీతి, నిజాయితీ కలిగిన అధికారులు కావాలి, కానీ నీతి నిజాయితీ, జవాబుదారీతనం కలిగిన రాజకీయ నాయకులూ అవసరం లేదు. అదేమిటంటే రాజకీయాలన్నీ ఇప్పుడే ఇలానే తయారయ్యాయి కదా .. రాజకీయాలు ఇలా తయరవుతాయనే కాబట్టి మనకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ప్రతి నిధులను ఎన్నుకోమని చెప్పింది. డబ్బు, మందు తీసుకున్నప్పుడే మనం .. ఎమ్మెల్యే కానీ ఎంపీ నుంచి కానీ పనులను అడిగే హక్కు కోల్పోయినట్టే.
Image result for voter
నిజానికి రాజకీయాలు చాలా పవిత్రమైనవి. ఎప్పుడంటే డబ్బు, కులం, మందు పిచ్చి లేకుండా ప్రజా ప్రతినిధి ఎన్నుకున్నపుడు. ఎందుకుంటే ఇక్కడ ప్రజలే న్యాయనిర్ణేతలు. మీరు ఓటేస్తే చట్ట సభల్లో అడుగు పెడతారు.లేకుంటే ఇంట్లో కూర్చోంటారు. దేశ అభివృద్ధి నీ కుటుంబం ఒకటే బాగుపడితే సాధ్యపడదు ... నీతి, నిజాయతి, భాద్యత కలిగిన ప్రజా ప్రతినిధి చట్ట సభల్లో అడుగుపెట్టినప్పుడే మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే చివరికి దేశంలో ప్రజలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చట్టాలు చేసేది వారే కాబట్టి. డబ్బు పంచడానికి వచ్చిన వ్యక్తికి చెంప చెల్లుమనే విధంగా సమాధానం చెప్పండి.
Image result for voter
వేల కోట్లు ప్రజా ప్రతినిధుల స్వంత ఆస్థిగా మారకపోతే మనకు ఉన్న వనరులతో దేశ అభివృద్ధి అనేది నల్లేరు మీద నడక లాంటిది. ప్రతి రూపాయికి జవాబుదారిగా ఉండే వ్యక్తిని ఎంచుకోండి. రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఎంచుకోండి. దేశ అభివృద్ధి కానీ మన అభివృద్ధి కానీ కుల పునాదుల మీద ఆధారపడి ఎంచుకున్న వ్యక్తి ద్వారా సాధ్యపడదని గ్రహించండి. రాబోయే ఎన్నికల్లో మీ యెక్క ఓటు స్టామినా చూపించండి. డబ్బు ద్వారా, బలగం ద్వారా , కులాలను రెచ్చకొట్టడం ద్వారా గెలవచ్చనుకునే నాయకులకు గుణ పాఠం చెప్పండి. మీఓటు ద్వారా సరి కొత్త రాజకీయానికి బాటలు వెయ్యండి. 

జై హింద్ !!

మరింత సమాచారం తెలుసుకోండి: