చీరాల లో నామినేషన్ ప్రక్రియ అట్టహాసం గా సాగింది . ఇరు వర్గాల నుంచీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది అని పచ్చ మీడియా హడావిడి చేస్తూ ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ లోకి వచ్చేసరికి మాత్రం అంత సీన్ లేదు అన్నట్టు అంతా పేలవంగా సాగింది. ఒంగోలుజిల్లా  పొలిటికల్ హెడ్ క్వార్టర్ గా చెప్పుకునే చీరాల లో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటూ వచ్చింది .. గత రెండు సార్లూ గెలిచి ఎమ్మెల్యే ఐన ఆమంచి కృష్ణ మోహన్ మీద లోకల్ గా విపరీతమైన క్రేజ్ ఉంది అనేది విశ్లేషకులు మొదటి నుంచీ చెబుతున్న మాట.


కానీ పచ్చ మీడియా మాత్రం తమదే డామినేషన్ అని చెప్పుకోవాలి అన్నట్టు విశ్వ ప్రయత్నం చేసింది. అయితే నామినేషన్ ప్రక్రియ చూసినా, ర్యాలీ లో జనం యొక్క నాడి చూసినా అసలు విషయం బయట పడిపోయింది. చీరాల లో వార్ వన్ సైడ్ అనే విషయాన్ని ఈ ఒక్క సంఘటన తేల్చేసింది అని చెప్పాలి.


పొలిటికల్ నాడి విషయం లో జనం క్లియర్ గా తేలిపోయింది. కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల ర్యాలీ కి ప్లాన్ చేసిన కరణం బలరాం - టీడీపీ వర్గం జన సమీకరణ లో కూడా ఫెయిల్ అయ్యారు. మరొక పక్క ఆమంచి కృష్ణ మోహన్ - వైకాపా వర్గం పదిహేను కిలోమీటర్ల పైగా నామినేషన్ ర్యాలీ ని ప్లాన్ చేసారు. జన సమీకరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా వేలాది మంది పోటెత్తారు.


దాదాపు ముప్పై వేల జనం ఈ నామినేషన్ లోనే కనిపించారు అని లోకల్ జనాలు చెబుతున్న మాట. నామినేషన్ కోసం ఒక 10 కిలోమీటర్లు కూడా నడవలేని వయసు మళ్ళిన కరణం కి ఏ కారణం తో ఓటు వెయ్యమంటారు అని ప్రజలే టీడీపీ ని ప్రశ్నిస్తున్నారు.


పైగా బీసీ సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్న చీరాల లో కమ్మ సామజికవర్గ నేత కి టికెట్ ఇవ్వడం ఏంటి అంటూ ప్రజలు సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయ్యింది పరిస్థితి.


ఆమంచి ని ఓడించడం మాట అటుంచి ఆయన మెజారిటీ  గురించే డిస్కషన్ లు జరుగుతున్నాయి .. అది కూడా టీడీపీ  వర్గాల్లో .. 


మరింత సమాచారం తెలుసుకోండి: