పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సాధారణ అభిమానులకే కాదు సినీరంగం లోని చాలా మంది  ప్రముఖులకు కూడా ఆయన అభిమానమే. అలాంటి లిస్టులో డైరెక్టర్ కొన వెంకట్ ముందుంటారు. పవన్ కళ్యాణ్ కొన గురించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కానీ కోన మాత్రం తనకు మంచి ఆప్తమిత్రుడనీ చాలా దగ్గరి వాడని ఎప్పుడు డబ్బా కొట్టుకునేవాడు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఊగిపోయి, పవన్ నీ పొగడ్తలతో ముంచెత్తెవాడు. సమయం సందర్భం లేకుండా ప్రతి ఇంటర్వ్యు లోని పవన్ పేరును ప్రస్తావించేవాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసినపుడు కూడా అతనిని పొగిడాడు. కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ గురించి చెబుతూ గొప్పలకి పోయేవాడు.

కానీ ఎన్నికల సమయం దగ్గర పడే సరికి కొన తన రంగు మార్చాడు. పవన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తెలంగాణా ను ఉద్దేశిస్తూ చెప్పిన మాటలను తప్పుబడుతున్నాడు కోన. ఇరు రాష్ట్రాల ప్రజల్లో విద్వేషం రగిల్చే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని విమర్శించాడు.పవన్ ను విమర్శించిన వ్యాఖ్యాలు" పవన్‌ కల్యాణ్‌ సినీ రంగంలో నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంతటి అనుబంధం ఉంది. కత్తి మహేష్‌ వివాద విషయంలో పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్‌ తప్పటడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశంగా స్పందిస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. పవన్‌ ఇలాంటి ప్రకటనలను ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో అర్ధం కావడం లేదు'' అని కోన అన్నాడు.పవన్‌ను విమర్శిస్తూ జగన్ మీద కోన ప్రశంసలు గుప్పించడం విశేషం.


జగన్‌ను నవ్యాంధ్ర ఆశాజ్యోతిగా పేర్కొన్నాడు కోన. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పచ్చి మోసగాడిగా అభివర్ణించాడు. జగన్ మీద పవన్ చేస్తున్న ఆరోపణల్ని కోన ఖండించాడు. ఈ ఆరోపణలకు ఒక్క ఆధారం చూపించినా తాను జనసేన జెండా పట్టుకుని తిరుగుతానన్నాడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలే శ్వాసగా బతికే కుటుంబం వైఎస్‌ జగన్‌దని, తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాయావతి పవన్‌కు మదర్ థెరెస్సాలా ఎలా కనిపించిందో అర్థం కాలేదన్న కోన, ఎన్నికల ముందు ఆమెతో స్వప్రయోజనాల కోసమే పవన్ పొత్తు పెట్టుకున్నాడని విమర్శించాడు. కోన లోని ఈ కొత్త కోణం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: