గుంటూరు జిల్లా మంగళగిరిలో తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కి వచ్చారు. స్వార్థపూరిత రాజకీయాల విముక్తి చేయటానికి, వ్యభిచార రాజకీయాలకు స్వస్తి పలకటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజకీయాల నుండి ఏమీ ఆశించనని పైగా 24 గంటలు ప్రజాసేవకే అంకితమై ప్రజా సేవకు అందుబాటులో ఉంటానన్నారు.
tamanna simhadri photos కోసం చిత్ర ఫలితం
మొదట్లో జనసేన పార్టి నుండి తాను టిక్కెట్ ఆశించానని, కాని పవన్ కళ్యాణ్ నిరాకరించారని తెలిపారు. తాను నాలుగు గోడలకే పరిమితం కాకూడదని అనుకొని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటికి సిద్ధపడ్డానన్నారు. రాజధాని అమరావతికి మంగళగిరి కీలకమన్నారు. 
మంగళగిరిలో నారా లోకేష్‌పై  తమన్నా పోటీ
నారా లోకేష్ ఏం? ఆశించి ఇక్కడ పోటి చేస్తున్నారని ప్రశ్నించారు తమన్నా. లోకేష్ ఎం ఎల్ సి పదవికి రాజీనామా చేసి ఎం ఎల్ యే స్థానానికి పోటి చేయాలన్నారు. కాని భూకబ్జాల కోసమే లోకేష్ ఇక్కడ నుండి పోటి చేస్తున్నారని విమర్శించారు. ట్రాన్ప్‌జెండర్ల అందరి హక్కుల సాధన కోసం మెరుగైన సమాజం కోసం భవిషత్ లో అన్ని నియోజకవర్గాల్లో పోటి చేయాలని ఈ సందర్భంగా తమన్నా పిలుపునిచ్చారు. ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి తొలిసారిగా ఏపి లోని మంగళగిరి నియోజకవర్గం నుండి ముఖ్యంగా నారా లోకేష్ నాయుడిపై పోటీ చేస్తున్నట్లు చెప్పారు. 

nara lokesh opponeents in mangalagiri కోసం చిత్ర ఫలితం

మంగళగిరి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి అక్కడ పోటీలో ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు గట్టి సవాల్ విసిరారు. లోకేష్ కు దమ్ముంటే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా పోటీకి రావాలని తమన్నా సింహాద్రి చాలెంజ్ చేశారు. తను జనసేన పార్టీ తరఫున పోటీ చేసే ప్రయత్నం చేశానని అయితే అక్కడ అవకాశం దక్కలేదని ఆమె చెప్పారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు.

లోకేష్ కు ట్రాన్స్ జెండర్ సవాల్.. స్పందిస్తారా?

నారా లోకేష్ బాబు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోవడంపై మొదటి నుంచి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండిన రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటివాళ్లు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో సీరియస్ గా శ్రద్ధ పెట్తటానికి వాళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే లోకేష్ మాత్రం అంత ధైర్యం చేయడం లేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.



ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా ఎన్నికలను ఎదుర్కొంటూ, లోకేష్ ఇలా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారు. చివరకు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా, లోకేష్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలని సదరు తమన్నా ఇండి
పెండెంట్ సవాల్ విసిరారు. మరి దీనికి లోకేష్ స్పందించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: