ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కి అంతా సిద్ధమైంది. ప్రధాన పార్టీలైన టీడీపీ - వైకపా మధ్య నువ్వా నేనా అనేంతగా సాగుతోంది ఎన్నికల కథ. ఈ క్రమం లో ప్రచారం విషయం లో మాత్రం జగన్ మోహన్ రెడ్డి దూసుకుని పోతున్నారు అనే మాట వినపడుతోంది.


రాజకీయ విశ్లేషకులు కూడా మాస్ కి దగ్గర అవుతున్న జగన్ కి తిరుగులేదు అనే అంటున్నారు. అయితే రీసెంట్ గా జరుగుతున్న తన ప్రచార సభల్లో జగన్ వారాల జల్లు కురిపిస్తున్నాడు. అన్ని వర్గాలకీ చేరువ అయ్యేలా జగన్ హామీలు ఉండడం చాలా పాజిటివ్ విషయం అనే చెప్పాలి.


ప్రభుత్వ ఉద్యోగులు , చిరు వ్యాపారుల మీద వై ఎస్ జగన్ తనదైన శైలి లో హామీల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే, పోలీస్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులతో పాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలు ఇస్తాం అని ప్రకటించిన జగన్ వారానికి ఒక రోజు సెలవు ఇస్తాం అని ప్రకటించారు. అలాగే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్లకి 10000 పైగా వడ్డీ లేని ఋణం అందిస్తాం అని ప్రకటించారు.


తాను ఎంతో నమ్మకం తో చెబుతోన్న నవరత్నాలు ప్రతీ ఒక్కరి జీవితం లో వెలుగు నింపబోతోంది అని జగన్ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకునే దౌర్భాగ్యం పట్టింది అనీ తాము అధికారం లోకి వచ్చిన వెంటనే పోలీస్ బాసులకు సీఎం చంద్రబాబు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని జగన్ తెలిపారు.



ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ అవి నమ్మద్దు అనీ జగన్ బలంగా మాట్లాడారు. ఆదోని నియోజికవర్గం లో తీవ్రంగా ఉన్న నీటి ఎద్దడి సమస్య ని నివారించడమే తన ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చారు జగన్. జగన్ హామీల్లో పోలీసులకి సెలవు అనే అంశం బాగా క్లిక్ అవుతోంది. వారి జీవిత కాల కోరికని జగన్ తీర్చినట్టే అంటున్నారు విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: