ఎప్పుడు వివాదంలో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎప్పుడు తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే వర్మ ఒక ఇంటర్వ్యు లో భాగంగా "మీరు ఎవరు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు?" అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వర్మ ఇచ్చిన సమాధానం, "ఏపీలో తాను సీఎం కావాల‌నుకునే వ్య‌క్తులు ఇద్ద‌ర‌ని. అందులో మొద‌టి చాయిస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని. రెండో ఛాయిస్ కేఏ పాల్ గా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే రోజు న్యూస్ పపేర్ మొదటి పేజీలో తన అందమైన ముఖం చూసే అవకాశం ఉంటుంది అన్నాడు. అలాగే కే. ఏ. పాల్ సీఎం అయితే ఏపీ ప్రజలకు వినోదానికి ఢోకా ఉండదు.

ప్రతి రోజు పాల్ చేసే చేష్టలతో హాయిగా నవ్వుకోవచ్చు అని అన్నాడు. ఇప్పుడున్న రాజకీయ వేడిలో కే. ఏ.పాల్ చేసే పనులతో కాస్త కూల్ గా కామెడీ గా మారిపోయింది అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన చేసే చేష్టలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడమే కాకుండా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఆయనొక ఆటలో అరటిపండుల మారిపోయారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయ‌న చేసి ప‌ని ఒక‌టి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అర్థ‌రాత్రి 3 గంట‌ల ప్రాంతంలో సోష‌ల్ మీడియాలో ఆన్ లైన్  లైవ్ పెట్టి ఎన్నిక‌ల నిబంధ‌న ఉల్లంఘించిన‌ట్లుగా చెబుతున్నారు.

మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు భిన్నంగా రోడ్ల మీద కంటే కూడా కే ఏ పాల్ సోష‌ల్ మీడియాలోనూ, ఆన్ లైన్లోనూ ఆయ‌న ప్ర‌చార హ‌డావుడి క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఎన్నిక‌ల సంఘం ప‌రిమితుల‌కు భిన్నంగా తెల్ల‌వారుజామున ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఎలా నిర్వ‌హిస్తార‌న్న ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.దీనికి కేఏ పాల్ ఇచ్చిన స‌మాధానం వింటే ఆశ్చర్య పరుస్తోంది. ఇంత‌కీ పాల్ చెప్పిన స‌మాధానం ఏంటంటే  ఆన్ లైన్ లో తాను చేప్ట‌టిన లైవ్ కార్య‌క్ర‌మం ఎన్ ఆర్ ఐ ల కోస‌మ‌న వారితో ఉద‌యం వేళ‌లోనే తాను మాట్లాడాన‌ని, మ‌న‌కిక్కడ‌ అర్థ‌రాత్రి అయినా, వారికి ఉద‌యం క‌దా?  ఆ లెక్క‌న వారితో తాను చేప‌ట్టిన ఆన్ లైన్ లైవ్ కార్య‌క్ర‌మం ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించిన‌ట్లు ఎందుక‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి పాల్ వేసిన ప్ర‌శ్న‌కు ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: