తెరాస పార్టీని ఏపీ ఎన్నికల ప్రచారంలోకి  లాగుతున్నారు అంటూ కేటీఆర్ అన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తెరాస పార్టీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనికి రాని పనులను పక్కన పెట్టీ తను ఎలా గెలవాలి అనే దాని పై శ్రద్ద పెట్టాలని అన్నారు. కేటీఆర్ చెప్పిన మాటలు "చంద్రబాబు మానసికంగా ఏ స్థితిలో ఉన్నారో నాకుతెలీదు. కానీ ఆయన ఓ విషయాన్ని మరిచిపోతున్నారు. అది గుర్తుచేస్తున్నాను. మేం ఏపీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. మాపై విమర్శలు చేసి ఆంధ్రా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు.


ప్రజలకు గ్రాఫిక్స్ మాయాజాలంతో బాహుబలి సినిమా చూపించారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి అక్కడ జరిగిందేం లేదు. అంతా డొల్ల మిగిలింది. ప్రజల ముందు తన బాగోతం బయటపడుతుందని భయపడి కేసీఆర్ ను ఓ బూచిలా చూపించబోతున్నారు. అదొక చిల్లర లేకి భావదారిద్ర్య ప్రయత్నం. ఇలాంటి చీప్ ట్రిక్స్ ను ప్రజలు తిరస్కరిస్తారు. చంద్రబాబుకి రిటైర్మెంట్ దగ్గరపడింది." అని అన్నారు. తను ఏం చెబితే ప్రజలు అది వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని. త్వరలోనే బాబుకు ఆ భ్రమలు తొలిగిపోతాయని అన్నారు కేటీఆర్. పచ్చమీడియా సహాయంతో నాలుగు పచ్చమాటలు చెబితే ఆ పిచ్చి మాటల్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తారని భావిస్తున్నారని, ఆంధ్రా ప్రజలు చంద్రబాబు కంటే వందల రెట్లు తెలివైన వాళ్లని అన్నారు."కేసీఆర్ పాలన చూసి ఆంధ్రాలో కూడా ఆయనకు అభిమానులు తయారయ్యారు.

మా రైతుబంధను కాపీకొట్టి అన్నదాత సుఖీభవను ప్రవేశపెట్టాడు చంద్రబాబు. ఇక్కడ కల్యాణలక్ష్మీ పెడితే, అక్కడ పసుపు-కుంకుమ పెట్టాడు. ఇక్కడ మిషన్ కాకతీయ అనగానే అక్కడ నీరు-చెట్టు అంటాడు. కాపీ-పేస్ట్ వ్యవహారం తప్ప బాబుకు కొత్తగా చెప్పుకోవడానికేం లేదు. మరీ ముఖ్యంగా అన్నీ ఎన్నికలకు ముందుపెట్టినవే. ఇక ఏం చెబుతాడు ప్రజలకు."ప్రస్తుతం బాబు పరిస్థితి లోకేష్ కు ఎక్కువ, కేఏ పాల్ కు తక్కువ అన్నట్టు తయారైందన్నారు కేటీఆర్. ఏదేదో మాట్లాడుతూ ప్రజల దృష్టిలో కామెడీ పీస్ గా మారిపోయారని విమర్శించారు. పైగా కేసీఆర్ ఎప్పుడు తిడతారా అని చంద్రబాబు వెయిట్ చేస్తున్నారని, కేసీఆర్ తిట్టిన వెంటనే సెంటిమెంట్ ను రగిలించడానికి ప్రయత్నిస్తారని కేటీఆర్ అన్నారు. ఇకనైనా చంద్రబాబు ఈ చీప్ పాటిలిక్స్ ఆపి, హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: