తెలంగ‌ణ రాష్ట్ర స‌మితి అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ చివ‌రి నిమిషంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్లుగా పార్టీకి చెందిన నేత‌ల పేర్లు ఇచ్చి పార్టీ సీనియ‌ర్ నేత హ‌రీశ్ రావుకు మొండి చేయి చూపారు. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి 20 మంది జాబితాను ఆ పార్టీ ఎన్నికల సంఘానికి పంపగా ఇందులో హ‌రీశ్‌రావు పేరు లేక‌పోవ‌డంపై క‌ల‌క‌లం రేగింది. తాజాగా దాన్ని స‌వ‌రించుకుంది.

టీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, రాష్ట్ర క్యాబినెట్‌లోని 11 మంది మంత్రులు, సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, అయిదుగురు ప్రధాన కార్యదర్శులు జె.సంతోష్‌కుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, టి.రవీందర్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది. ఆ జాబితాలో టీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి టి.హరీశ్‌ రావుకు స్థానం దక్కలేదు.


హ‌రీశ్‌రావుకు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవ‌డంతో టీఆర్ఎస్ పార్టీ వెంట‌నే త‌గు చ‌ర్య‌లు తీసుకుంది. తాజాగా మ‌రో విన‌తిప‌త్రం స‌మ‌ర్పించి హ‌రీశ్‌రావుకు స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో చోటు క‌ల్పించాల‌ని కోరింది. ముందు జాబితాలో చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం...త‌ర్వాత మ‌రో విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: