తిరుపతిలో నేడు "ఆధునిక పరిశోధనా కేంద్రం" (సీ ఎఫ్ ఏ ఆర్) ను దాని యొక్క దాత అయిన రాజీవ్ శ్రీ గోపాల్ గారు మరియు స్విమ్స్ డైరెక్టర్ అయిన డా. టీ ఎస్ రవి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సీ ఎఫ్ ఏ ఆర్ రాజీవ్ శ్రీ గోపాల్ గారి వైటల్ లాబొరేటరీస్ ఇచ్చిన 12 కోట్ల విరాళం తో నిర్మించబడింది.




ప్రారంభోత్సవంలో దాత అయిన రాజీవ్ శ్రీ గోపాల్ గారు అదనంగా మరో 5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ మొత్తాన్ని మరో మూడు ఫ్లోర్లు నిర్మాణానికి మరియు అత్యుత్తమ పరిశోధనా విభాగాలైన జన్యవుల పర్యావరణం, పునరుత్పత్తి వైద్యం మరియు మూల ఉత్పాదక కణం, తల్లీ బిడ్డా ఆరోగ్యం, గాయాలు మరియు నానో సైన్స్ కోసం కేటాయించనున్నట్లు తెలిపారు.HICC ఈ కార్యక్రమాన్ని  కోటీ గ్రూప్ ఆఫ్  టెక్నాలజీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో అనుసంధానమై కొత్తగా ప్రారంభించింది.




ఈ కార్యక్రమం కోటీ గ్రూప్ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు అయిన కోటీ సరిపల్లి మరియు రవి కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. కోటీ - స్విమ్స్ యొక్క భాగస్వామ్యంలో దేశంలోనే అత్యుత్తమ మోడల్ అయిన " రియల్ టైమ్ యాక్షనబుల్  పేషంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కేర్" గురించి ఈ మొట్టమొదటి సెషన్ లో తెలిపారు. 




ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ సీ ఎఫ్ ఏ ఆర్ అనేది దేశానికే గర్వకారణం అని తెలిపారు. ఇది ప్రజల్లో కొత్త పరిశోదనలు చేసి, తమ తమ జ్ఞానంతో పరిశోధన విభాగంలో పెను మార్పులతో ప్రజల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు దోహదపడుతుంది అని అన్నారు.


ఇంకా ఈ ఐదు కోట్ల అదనపు మొత్తం తో మొత్తం 41 కోట్లు ఆయన స్విమ్స్ కి దానం చేశారు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ బజాజ్ మరియు ఆయన సతీమణి దీపిక బజాజ్ ను సత్కరిస్తూ వారి ఉదార స్వభావానికి బిల్ గేట్స్ మరియు మెలిందా గేట్స్ తో పోల్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: