నంద్యాల ... ఆసక్తి రేపుతున్న నియోజక వర్గాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది అయితే ఈ సారి టీడీపీకి గెలుపు అంత ఈజీ వ్యవహారం అయితే కాదని చెప్పి తీరాలి. ఉప ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు తెలుగుదేశం వాళ్లు. వాటిల్లో కొన్నింటిని తప్పనిసరిగా అయినా పూర్తి చేశారు. మామూలుగా అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఊసులో ఉండేది కాదేమో. విజయం  విషయంలో ఆశలు ఉండేవి కావేమో. అయితే..  ఉప ఎన్నికల సందర్భంగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం ఇప్పుడు ఒకింత సానుకూలంగా మారుతూ ఉంది.


సానుకూలం అంటే.. అది విజయాన్ని సాధించి పెడుతుందని కాదు, గట్టిగా పోటీలో నిలుపుతూ ఉంది సైకిల్ పార్టీని. భూమా బ్రహ్మానందరెడ్డి వ్యక్తిగతంగా సౌమ్యుడు అనే పేరు తెచ్చుకోవడం మరో ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. భూమా నాగిరెడ్డి రాజకీయానికి బ్రహ్మానందరెడ్డి రాజకీయానికి సంబంధం లేదు. అదే బ్రహ్మానికి ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. ఇక శిల్పా మోహన్ రెడ్డికి మంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు ఇప్పటికీ ఆయనకు  మైనస్ గానే ఉంది.  ఇప్పుడు ఆయన తనయుడు పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికీ నంద్యాల్లో ఒకింత బ్లాక్ మెయిలింగ్ రాజకీయం సాగుతూ ఉంది.


ప్రత్యేకించి ఇళ్ల పట్టాలను ఇంకా పెండింగ్ లోనే పెట్టారు. ఎన్నికలు అయ్యాకా వాటిని ఇస్తామని, తాము గెలిస్తేనే.. అనే షరతును పెడుతూ ఉండటం గమనార్హం. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన ఓటు బ్యాంకు తనకు ఉంది. ఉప ఎన్నికల సమయంలో భూమా బ్రహ్మం విజయానికి గట్టిగా పని చేసిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు పైకి అయితే టీడీపీనే కానీ.. అప్పటిలా కష్టపడే అవకాశాలు మాత్రం నిస్సందేహంగా లేవు. ఉప ఎన్నికలప్పుడు తెలుగుదేశం వైపు నుంచి అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నా వైసీపీ ఇక్కడ తన సత్తా ఏమిటో చూపించింది. ఇప్పుడు అవే ఓట్లను మళ్లీ నిలుపుకున్నా.. విజయం శిల్పా  మోహన్ రెడ్డి  తనయుడిని వరించడం ఖాయం. అయితే ఈసారి కూడా డబ్బు ప్రభావం గట్టినే ఉంటుందని అంటున్నారు.  ఉప ఎన్నికల సమయంలో జనాలు రుచి మరిగారు. ఇప్పుడు కూడా వారు అలాంటి ఎక్స్ పెక్టేషన్లతో ఉన్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేస్తూ ఉండటం వైఎస్సార్సీపీకి మరో సానుకూల అంశం అవుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  – 45

తెలుగుదేశం పార్టీ 40

జనసేన -15

మరింత సమాచారం తెలుసుకోండి: