తెలుగుదేశం పార్టీ ఈ మధ్య తన స్టార్ కాంపెనియర్లను ప్రకటించింది వారంతా విమర్శలు చేయడం, టీడీపీ కోసం చెప్పడం కోసం రెడీ అయిపోతున్నారు. మరి వైసీపీకి స్టార్ కాంపెనియర్ ఎవరు... ఎందరో సినిమా స్టార్లు వైసీపీకి మద్దతుగా  ఉన్నారు. మరి వారు బయటకు వస్తారా..


అయితే వైసీపీకి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న జగన్ ఉండగా మిగిలినవి అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇక జగన్ రోజుకు మూడు జిల్లాలు చుట్టేస్తున్నారు. అయితే ఆయన ఎంత తిరిగినా ఇంకా కవర్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. దాంతో ఇపుడు ఆయన చెల్లెలు షర్మిల రంగంలోకి దిగుతోంది. నిజానికి ఆమె ప్రసంగాలు ప్రత్యర్ధుల వెన్నులో చలి పుట్టిస్తాయి. వైఎస్సార్ హావ భావాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న షర్మిల రంగంలోకి దిగిందంటే చాలు మాటల తూటాలే. ఆమెలో వైఎస్సార్ని చూసుకునే జనం ఆమె ప్రసంగాలను కూడా ఎంతో ఆసక్తిగా వింటారు.


ఇపుడు షర్మిల జగన్ వదిలిన బాణంలా దూసుకువస్తున్నారు. ఏకంగా మంగళగిరి నుంచి ఆమె ప్రచారం మొదలవుతోంది. అక్కడ పోటీ చేసేది ఎవరో కాదు, ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకెష్ బాబు. మీడియా మీట్ లోనే లోకెష్ పై సెటైర్లు వేసిన షర్మిల ఇక ఏకంగా ఎన్నికల ప్రచార సభల్లో ఏ విధంగా అటాక్ చేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. టీడీపీకి పట్టుందని భావిస్తున్న క్రిష్ణ గొదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలను షర్మిల ప్రచారానికి కేటాయించారు. ఇప్పటికే ఇక్కడ గాలి మారుతోంది. ఇపుడు షర్మిల రంగంలోకి దిగితే అది వైసీపీకి గ్రాండ్ విక్టరీయే అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: