ఎన్నికల్లో ప్రచార సరళి చాలా ముఖ్యం. దాన్ని బట్టి ఫలితాలు మారుతూంటాయి. ప్రజలకు కూడా దీని మీద ఓ అంచనా అవగాహన వస్తాయి. దేశంలోనూ, కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను పరిశీలించినపుడు ప్రచార సరళి ఒక్కసారిగా మారిపోయి అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.


ఏపీ విషయానికి వస్తే ఇక్కడ అధికారంలో ఉన్నది టీడీపీ. పోటీ చేస్తున్న ప్రతిపక్షాలు విమర్శించాల్సింది చంద్రబాబుని, ఆయన విధానాలను. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. జగన్ వైపుగా అందరూ బాణాలు దూస్తున్నారు. జగన్ అధికారంలో లేడు కానీ ఆయనే అందరికీ టార్గెట్ ఐపోయారు. టీడీపీ ఎలాగూ జగన్ని లక్ష్యంగా చేసుకుంటుంది, కానీ కొత్తగా వచ్చిన జనసేన కూడా  జగనే అంటోంది. కామ్రేడ్స్ జగన్ మీద విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు, మేధావులు ఇలా ప్రతి ఒక్కరూ జగన్ నామ స్మరణ చేస్తున్నారు దీంతో ఏపీలో మొత్తం ఎన్నికల సీన్  జగన్ వర్సెస్ అదర్స్ గా మారిపోయింది.


దీని మీద జగన్ అన్న మాట ఇలా ఉంది. పండ్లున్న చెట్టుకే అందరూ రాళ్ళు వేస్తారు. మనం గెలవబోతున్నాం, అందుకే అంతా కలసి విమర్శలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక  సినీ రచయిత కోన వెంకట్ అయినా మరో రచయిత చిన్ని క్రిష్ణ , పోసాని క్రిష్ణ మురళీ, అయినా నట్టి కుమార్ అయినా చెప్పేది ఒక్కటే. జగన్ని ఒంటరిని చేసి అంతా ఇబ్బంది పెడుతున్నారని. ఇది జనంలోకి మెల్లగా వెళ్ళిపోతోంది. జగన్ ఓ వైపు, మిగిలిన వారంతా మరో వైపు అన్న విభజన వస్తే అది కచ్చితంగా జగంకే అడ్వాంటేజ్ అవుతుంది.
అపుడు మిగిలిన ఓట్లను బాబు అండ్ కో పంచుకోవాల్సివస్తుంది. తెలంగాణాలో ఇదే జరిగింది. కెసీయార్ ఒక్కడూ, మిగిలిన వారంతా ఓ వైపున్నారు. చివరికి ఈవీఎం లు ఓపెన్ చెస్తే ప్రజా తీర్పు విస్పోటనం ముందు ఇతర పక్షాలు నిలబడలేకపోయాయి. రేపు ఏపీలోనూ అదే జరుగుతోందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: