గత కొన్ని రోజులుగా ఐటి గ్రిడ్ వార్తల నేపథ్యంలో ఏపిలోని ఓటర్లు కన్ఫ్యూజ్ లో పడ్డ విషయం తెలిసిందే.  తమ ఓట్లు ఉన్నాయో లేవో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.  ఇక్కడ రాజకీయ నాయకులు ఓట్ల గల్లంతు జరుగుతుందని..చివరికి అధినేతలే తమ ఓట్లు మాయం చేస్తున్నారనే పరిస్థితి కూడా నెలకొంది. 

ఇదిలా ఉంటే ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుదిజాబితా విడుదల చేసింది.  ఏపిలో మొత్తం 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొంది.  అయితే జనవరి 1 నుంచి కొత్త ఓట్లు నమోదు అయిన విషయం తెలిసిందే.  ఆ ఓటర్ల సంఖ్య 25, 20,924 మంది అని, జనవరి 1 తర్వాత ఓటర్ల జాబితా నుంచి తీసివేతలు 1,41,823 అని తుదిజాబితాలో నివేదించారు. 

అయితే ఈ నివేదికల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 42,04,436 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అదే సమయంలో విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,18,016 మంది ఓటర్లు ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: