అనేక యుద్ధాలో ఆరితేరిన సీనియర్ నాయకుడు చంద్రబాబు. ఆయన ఎన్నికల రాజ‌కీయాల్లో బాగా పండిపోయారు. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రూపకల్పన చేయడంలో బాబును మించిన వారు లేరంటారు. ఎవరేమనుకున్నా తన దారి తనదే, అది అధికారాన్ని చేరువ చేసే దారి అని బాబు గట్టిగా నమ్ముతారు.


బాబు గ్లామర్ ఉన్న నేత కాదు, అయినా అన్న నందమూరి కంటే కూడా ఎక్కువసార్లు ముఖ్యమంత్రి గాపాలించారు. ఆయనకి పొలిటికల్ గ్లామర్ కంటే గ్రామర్ బాగా తెలుసు. ఎప్పటికి ఏది అవసరమో దాన్ని అందుకోవడంలో బాబు ముందుంటారు. చంద్రబాబు  సభల కంటే మిగిలిన వారికి విరగ‌బడి జనం వస్తారు. బాబు ప్రసంగాలు బోర్ గా స్టీరియో టైప్ గా ఉంటాయి. అయినా సరే ఆయన ఎందుకు గెలుస్తున్నారు. అంటే ఆయన దగ్గర ఓ పదునైన ఆయుధం ఉంది. అదే ఎలక్షనీరింగ్.


ఏమిటి ఇంజనీరింగ్ కోర్స్ మాదిరిగా. ఈ కొత్త కోర్స్ ఏంటి అనుకోవాలి. కానీ ఇది కొత్త కోర్సే కాదు, బాబు  మార్క్ కోర్స్. ఇది ఇతరులు అనుసరించలేని కోర్స్. కొంతవరకే వారు ఫలితాలు పొందగలిగే కోర్స్. దీని స్రుష్టి కర్త చంద్రబాబు. కాబట్టి ఆయనకు ఈ కోర్స్ పూర్తిగా వంటబట్టేసింది. అందుకే ఆయన ఎన్ని ఎన్నికలు అయినా అనాయాసంగా సునాయాసంగా నెగ్గెస్తూ ఉంటారు


కోట్లాది ఓటర్లు ఉంటే ఓట్లు వేసేది 60 నుంచి డెబ్బై శాతమే. అందులో ఓ పార్టీకి అనుకూలంగా వేయాలనుకునే సాలిడ్ ఓట్లు కచ్చితంగా అంటే సెంట్ పెర్సెంట్ వేయించుకోవడం, అలాగే ప్రతిపక్షం ఓట్లు వీలున్నంతవరకూ ఎంత తగ్గించాలనుకుంటే అంత పడకుండా తగ్గించడం. ఇదే బాబు మార్క్ ఎలక్షనీరింగ్ . బూత్ లెవెల్లో ఇది చేయాలంటే నైపుణం కలిగిన, అంకిత భావం కలిగిన క్యాడర్ ఉండాలి. పార్టీ గెలుపు కోసం ప్రాణం ఇచ్చే వారు అక్కడ బూతుల్లో ఉండాలి.


టీడీపీ ఆ విధంగా అన్నీ సిధ్దం చేసుకుంది కాబట్టే గెలుపుపై ధీమాగా ఉంటోంది. గత ఎన్నికల్లో ఈ వ్యూహం తెలియక బొక్క బోర్లా పడిన వైసీపీ ఇపుడు బాబు దారిలోకి వచ్చింది. సభలు ఎంత సూపర్ హిట్ అయినా ఓట్లు పడేది బూతుల్లోనే. అక్కడ గట్టిగా ఉండాలని వైసీపీ ఈసారి నిర్ణయించుకుంది. దాంతో బాబు గారి ఎలక్షనీరింగ్ కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. ప్రచారం అంతా ఒక ఎత్తు, పోలింగ్ మరో ఎత్తు. ఇక్కడ ఎవరు ఎవర్ని చిత్తు చేస్తారో వారే విజేత.



మరింత సమాచారం తెలుసుకోండి: