విశాఖ ప్రతిష్టాత్మకమైన జిల్లా. ఇక్కడ మొత్తం మూడు ఎంపీ, పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికకూ విలక్షణతను చాటుకునే   ఓటర్లు ఇక్కడ  ఉన్నారు అలాగే ప్రతీ సారి ఎన్నికలకూ అభ్యర్ధులు, పార్టీలు పెరిగిపోతున్నారు. ప్రజలకు సేవ చేసే వారు ఎక్కువైపోతున్నారు.


నామినేషన్ల ఘట్టం ముగిసే నాటికి జిల్లాల్లొని మూడు  ఎంపీ సీట్లకు  52 నామినేషన్లు వచ్చాయి. అలాగే  మొత్తం 15 అసెంబ్లీ సీట్లకు గానూ 245 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటుకు 24 మంది, అనకాపల్లి ఎంపీ సీటుకు 14 మంది, అరకు ఎంపీ సీటుకు 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు అత్యధికంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి 25 మంది నామినెషన్లు దాఖలు చేస్తే అతి తక్కువగా నర్శీపట్నం,  భీమిలి అసెంబ్లీ సీట్కకు 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు.


ఇక విశాఖ తూర్పు నుంచి 17 మంది, విశాఖ దక్షిణం నుంచి 20 మంది, మాడుగుల నుంచి 17 మంది, అరకు నుంచి 14 మంది, పాడేరు నుంచి 18 మంది, అనకాపల్లి నుంచి 16 మంది, పెందుర్తి నుంచి 15 మంది, పాయకరావుపేట నుంచి 22 మంది,  ఎలమంచిలి నుంచి 14 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొంతమంది రెబెల్స్ కూడా ఉన్నారు. ఈ నెల 28న నామినేషన్ల విత్ డ్రా తరువాత ఎంతమంది పోటీలో ఉన్నది తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికైతే భారీ ఎత్తున నామినేషన్లు వచ్చాయని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: