అనేక రాజకీయ సమీకరణలు మారిన నేపథ్యంలో పి.గన్నవరం ఎన్నికల పోరులో అభ్యర్ధులు తలపడుతున్నారు.  అప్పటివరకు తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణమూర్తి మరోసారి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయనపై, ఆయన కుటుంబంపై ఉన్న వ్యతిరేకత అధిష్టానం దృష్టికి వెళ్లడంతో.. సీన్ రివర్స్ అయింది. ఆయన స్థానంలో నేలపూడి స్టాలిన్‌బాబును పోటీకి దింపారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు పోటీ చేయబోతున్నారు. జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి బరిలోకి దిగుతున్నారు. ఇక స్టాలిన్‌కి టికెట్ ఖరారు కావడంతో.. రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. తెదేపా కార్యకర్తలని కలుపుకుని ముందుకు వెళుతున్నారు. ఆ పైగా తీవ్ర వ్యతిరేకతని ఎదుకుంటున్న నారాయణమూర్తిని తప్పించడం తెదేపాకి కలిసొచ్చే అంశం. 


ఇక తెదేపా కేడర్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్టాలిన్ విజయానికి సహకరిస్తాయి. కానీ కొన్ని వర్గాల ప్రజల్లో తెదేపాపై వ్యతిరేకత ఉండటం మైనస్. అటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి వైకాపా అభ్యర్ధి చిట్టిబాబుకి కలిసిరానున్నాయి. ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ పోరాడుతున్నారు. అలాగే జగన్ పాదయాత్ర అంశం...ఎమ్మెల్యే నారాయణమూర్తి వైకాపాకి సహకరించడం ప్లస్ అవ్వోచ్చు. కానీ నారాయణమూర్తి వైకాపా జెండా కప్పుకోకుండా ఉన్నారు. ఇక జనసేన రాజేశ్వరి మహిళా అభ్యర్థి కావడంతో ఆమెకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. 2009లో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఇక్కడ జనసేన ఓటర్లు స్తబ్దుగా ఉన్నారు. కాపులు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. 


మొత్తానికి ఈ నియోజకవర్గంలో అధికార టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు సమాన బలంతో ముక్కోణపు పోటీలో దిగారు. ఒకరకంగా చెప్పాలంటే ముగ్గురు అభ్యర్ధులు గెలుపు అంచున ఉన్నారనే చెప్పొచ్చు. కాకపోతే ఎక్కువ తెదేపా-వైకాపా అభ్యర్ధులకి అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో పి గన్నవరం, అంబాజీపేట, అయినవెల్లి, మామిడికుదురు(పాక్షికం) మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్సీలు, కాపులు, శెట్టిబలిజలు ఎక్కువ ఉన్నారు. వారే అభ్యర్ధుల గెలుపుని డిసైడ్ చేయనున్నారు. అయితే కాపులు తెదేపా-జనసేనలకి ఎక్కువ మద్ధతు ఇస్తున్నారు. ఎస్సీలు వైకాపా వైపు ఉన్నారు. మరి చూడాలి పి గన్నవరాన్ని ఈసారి ఎవరి సొంతం చేసుకుంటారో. 



మరింత సమాచారం తెలుసుకోండి: