ఏపీలో అసెంబ్లీ, ఎంపీ సీట్లకు ఒకే మారు ఎన్నికలు జరుగుతున్నాయి. సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినపుడు, మొదటి విడతలోనే ఏపీకి ఎన్నికలు అన్నపుడు ఇంత తక్కువ టైమా అని అంతా అనుకున్నారు. అప్పటికి అభ్యర్ధుల ఎంపిక కాదు కదా, ఏ పార్టీ కూడా ఇంకా సర్దుకోలేదు. ఓ వైపు 25 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు ఎంపిక అంటే చిన్న వ్యవహారం కాదు. అలకలు, గొడవలు ఇలా ఎన్నో పేచీలు ఉన్నాయి. అయినా మొత్తానికి  ఆ గండాన్ని రాజకీయ పార్టీలు గట్టెక్కేశాయి.


ఒకేసారి అందరు అభ్యర్ధులను ప్రకటించి వైసీపీ టాప్ లో  నిలిచింది. ఇక విడతల వారీగానైనా 20వ తేదీలోగా పూర్తి చేసి టీడీపీ తాను రెడీ అనిపించుకుంది. చివరి నిముషం వరకూ జనసేన అభ్యర్ధులను ప్రకటిస్తూనే ఉంది. కొత్త పార్టీ గా ఇబ్బందులు దానికి  ఉన్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ మొత్తం సీట్లు ప్రకటించామని చెప్పినా ఎన్ని చోట్ల పోటీ అన్నది విత్ డ్రా తరువాత కానీ అసలు విషయం తెలియదు. కామ్రేడ్స్ జనసేన పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చారు, మళ్ళీ ఎన్నేసి లాగేసుకున్నారు అన్నది కూడా క్లారిటీ రావాలి. మొత్తానికి తొలి రౌండ్ అయిన  నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది.


ఇదిలా ఉండగా ప్రచార పర్వంలో కూడా వైసీపీ అధినేత జగన్  దూకుడుగా ఉన్నారు. గత వారం రోజులుగా అయన రోజుకు మూడు సభల వంతున జిల్లా టూర్లు చేశారు. మొత్తం పదమూడు జిల్లాల్లో  ఇప్పటికి పది  జిల్లాలో జగన్ ఎన్నికల సభల్లో  ప్రసంగించి అందరి కంటే ముందున్నారు. అదే విధంగా చంద్రబాబు కూడా దాదాపుగా  ప్రతీ రోజూ జిల్లాలో పర్యటనలు చేస్తూ వస్తున్నరు అయన కూడా ఉత్తరాంధ్రలో ఓ విడత ప్రచారం పూర్తి చేశారు. తొలి రౌండ్ లో ఆయన కూడా  ఎక్కువ జిల్లాలనే కవర్ చేశారు.


పవన్ ఈ నెల 21 నుంచి ప్రచారాన్ని మొదలెట్టరు పవన్ ఇప్పటికి విశాఖ పశ్చిమ గోదావరి, క్రిష్ణా, గుంటూర్ జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశారు మొత్తం ప్రచారంలో ఆయన ఇంకా కవర్ చేయాల్సి ఉంది. మిగిలిన ఇద్దరి కంటే ఆయన వెనకబడి ఉన్నారనే చెప్పాలి. అయితే ఇంకా పదిహేను రోజులు ఉంది కాబట్టి పవన్ ఆ జిల్లాల టూర్లు చేస్తారని అంటున్నారు. ప్రచారంలో రెండవ రౌండ్ లో  మిగిలిన నాయకులు వస్తారని అంటున్నారు. అపుడు సందడే సందడిగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: