మ‌చిలీప‌ట్నం.. ఉర‌ఫ్ బంద‌రుగా పేర్కొనే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల మ‌ధ్య పోరు హోరా హోరీగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ నుంచి టీడీపీ నాయకుడు, మంత్రి కొల్లు ర‌వీం ద్ర ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌త్స్యకార వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో మ‌రోసారి చంద్ర‌బాబు ఆయ‌న‌కే టికె ట్ కేటాయించారు. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు, అంద‌రినీ క‌లుపుకొని పోయేనాయ‌కుడు, ముఖ్యంగా బీసీ నాయ‌కుడు గా భావించిన చంద్ర‌బాబు కొల్లుకు ఇక్క‌డ మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మాజీ ఎమ్మెల్యే.. పేర్ని వెంక‌ట్రామ‌య్య‌.. ఉర‌ఫ్ పేర్ని నానికి జ‌గ‌న్ ఇక్క‌డ టిక‌ట్ కేటాయించారు. 


2008కి ముందు అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిసి ఉన్న ఈ ప్రాంతం.. త‌ర్వాత జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గం పున‌ర్విభ‌జ‌న‌లో.. ప్ర‌త్యేకంగా నియ‌జ‌క‌వ‌ర్గం ఏర్పాటైంది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2009లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పేర్ని నా ని పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, రాష్ట్ర విభ‌జ‌న వంటి అంశాల నేప థ్యంలో పేర్ని.. వైసీపీ గూటికి చేరారు. 2014లో ఇక్కడ నుంచి ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే, కొల్లు వ‌ర్సెస్ పేర్ని మ‌ధ్య ఎన్నిక‌ల పోరు హోరా హోరీగా సాగుతుంద‌ని భావించినా.. దాదాపు 15 వేల పైచిలుకు ఓట్ల తేడాతో వంశీ విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చూద్దాం.. టీడీపీ త‌ర‌ఫున మరోసారి కొల్లు, వైసీపీ త‌ర‌ఫున మ‌రోసారి పేర్ని ఇక్క‌డ నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. 


కాంగ్రెస్ త‌ర‌ఫున మైనార్టీ వ‌ర్గానికి చెందిన దాదాసాహెబ్, జ‌న‌సేన త‌ర‌పున బండి రామ‌కృష్ణలు రంగంలోకి దిగారు. అయి తే.. ప్ర‌ధాన పోటీ మాత్రం టీడీపీ-వైసీపీ మ‌ధ్యే ఉంటుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, బ‌లా బ‌లాల విష‌యాన్ని చూస్తే.. కొల్లుపై ఆశ‌లతో ఇక్క‌డి మ‌త్స్య‌కార వ‌ర్గాలు ఆయ‌న‌ను గెలిపించాయి. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో ఆయ‌న పెద్ద‌గా స‌క్సెస్ అయింది లేద‌ని అంటున్నారు స్థానికులు. ముఖ్యంగా మ‌చిలీప‌ట్నం పోర్టు విష‌యంలో పెద్ద‌గా దూసుకు పోయింది లేద‌ని, మ‌త్స్య‌కార వ‌ర్గాలకు ప్ర‌త్యేక పింఛ‌న్‌ను ఏర్పాటు చేయిస్తాన‌ని, గృహాలు నిర్మిస్తాన‌ని ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయ‌ని అంటున్నారు. అయితే, ఇలాంటి వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా.. త‌మ నాయ‌కుడిగా కొల్లుకు ఇక్క‌డి మ‌త్స్య కారులు మ‌ద్ద‌తిస్తున్నారు. 


ఇక‌, ఈ ఐదేళ్ల కాలంలో ఆయ‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌లు మాత్రం మైన‌స్‌గా మారుతున్నాయి. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. సంప్ర‌దాయంగా వ‌స్తున్న ఓటు బ్యాంకు పేర్నికి మ‌రోసారి క‌లిసి రానుంది. కొల్లుపై ఉన్న వ్య‌తిరేక‌త కొంత మేర‌కు లాభిస్తుందని అంటున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతి కూడా ప‌ని చేస్తుంద‌ని తెలుస్తోంది. అయితే, ఎవ‌రు గెలిచినా.. మెజారిటీ మాత్రం కేవ‌లం వంద‌ల్లోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: