ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటికే పోటీలోకి దిగిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గంలో తమ తమ పార్టీల తరఫున ప్రచారపర్వంలో ప్రజల మధ్య ఉంటూ అనేక హామీలు ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే రాబోతున్న ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఆంధ్ర రాజకీయాలు ఉన్నాయని చాలా మంది సీనియర్ నాయకులు అంటున్నారు.


ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఎక్కువగా వైసీపీ పార్టీ గెలుస్తుందని ముని సర్వేలలో తేలడంతో మరియు అదే విధంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా రాబోతున్న ఎన్నికల కు స్పష్టమైన అవగాహనతో ఒకేసారి అసెంబ్లీ అభ్యర్థులను లోక్ సభ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్ధరంగానికి రెడీ అయిపోయారు. ఇదే క్రమంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కూడా జాబితాల ఆధారంగా  తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించారు.


అయితే తాజాగా రాష్ట్రంలో నామినేషన్ల పర్వం..ముగిసిన నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు..3279 ఎమ్మెల్యే, 690 ఎపీ నామినేషన్లు దరఖాస్తు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి వస్తున్న సమాచారం. ఇందులో గుంటూరు నియోజకవర్గంలో ఎక్కువగా నామినేషన్లు వేశారట మరియు అదే విధంగా విజయనగరం జిల్లాలో అతి తక్కువగా నామినేషన్లు నమోదు అయినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: