పోటీ చేయాలన్న ఆరాటమే తప్ప అందుకు అవసరమైన వేదికను సిద్ధం చేసుకోవాలన్న ఆలోచన బికామ్ లో ఫిజిక్స్ చదవిని ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కొంప ముంచబోతోంది. కూతురు షబానా ఖాతూన్ చేసిన పొరబాటుతో ఇపుడు ఆమె నామినేషన్ తిరస్కారినికి గురయ్యే ప్రమాదంలో పడింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జలీల్ ఖాన్ కు టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ఎందుకంటే జలీల్ పై పెరిగిపోయిన వ్యతిరేకతే కారణం.

 

అందుకనే జలీల్ ఏం చేశారంటే తన కూతురు షబానా ఖాతూన్ ను రంగంలోకి దింపుతున్నట్లు చంద్రబాబును ఒప్పించారు. సరే చంద్రబాబు కూడా ఆమెకు టికెట్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. వెంటనే అమెరికాలో ఉంటున్న కూతురును జలీల్ వెంటనే పిలిపించారు. ఎంతమంది వ్యతిరేకిస్తున్నా వారిని కాదని చంద్రబాబు కూడా షబానాకే టికెట్ ఇచ్చారు. ఖాతూన్ నామినేషన్ కూడా వేసేసి ప్రచారం కూడా చేసుకుంటోంది.

 

ఈ నేపధ్యంలోనే ఎలక్షన్ కమీషన్ నుండి అందిన వర్తమానం జలీల్ కుటుంబంపై పెద్ద బండను పడేసింది. అదేమిటంటే, షబానా నామినేషన్ తిరస్కరణకు గురవుతోందని. ఎందకంటే, అమెరికాలో పౌరసత్వాన్ని వదులుకోకుండా షబానా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ వేయటమే కారణం. వేరే దేశంలో పౌరసత్వం కలిగున్న వారు మనదేశంలో నామినేషన్ వేసేందుకు లేదు. ఇంతచిన్న విషయాన్ని కూడా చూసుకోకుండానే షాబానా నామినేషన్ వేసేసింది. అదే ఇపుడు కొంత ముంచబోతోంది. సరే జలీల్ కూడా నామినేషన్ వేశారు లేండి. కాబట్టి చివరకు జలీలే అభ్యర్ధవుతారేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: