చంద్రబాబు ఐదేళ్లు ఏం చేసానో చెప్పకుండా కేసీఆర్ ను బూచిగా చూపించి ఎన్నికలు ఎదుర్కొవాలనుకుంటున్నారు. ఇటువంటి ప్రచారం చంద్రబాబుకు మేలు కంటే నష్టమే వాటిల్లుతున్నది. ప్రజలు కేసీఆర్ మీద వ్యహాతిరేకతతో లేరు. ఆ మాటకొస్తే అసలు కేసీఆర్ ఆంధ్ర ఎన్నికల్లో పోటీయే చేయటం లేదు. అలాంటపుడూ కేసీఆర్ ని లాగి విమర్శలు చేయడం, ఆ విమర్శలు ఓట్లు రాల్చుతాయనుకోవటం బాబు గారి భ్రమేనని చెప్పాలి. 


కేసీఆర్ పేరుతో చేస్తున్న ప్రచారమంతా టీడీపీకి వ్యతిరేకంగా మారుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడుతోంది. కేసీఆర్, జగన్ ఒకటే అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఎక్కడా ప్రజల నుంచి స్పందన రావడంలేదు, కనీసం ప్రజల్లో ఆ పాయింట్ పై చర్చ కూడా జరగడంలేదు. అసలు బాబు ఎందుకిలా మాట్లాడుతున్నారు, చంద్రబాబుకి ఏమైంది అనే ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి. జగన్ ని ఎదుర్కోలేకే చంద్రబాబు కేసీఆర్ పేరు చెప్పుకుని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని జనాలకు అర్థమైపోయింది. పోలవరాన్ని అడ్డుకుంటారు, మచిలీపట్నం పోర్ట్ ని తీసుకెళ్తారు అంటూ చినబాబు చేస్తున్న ప్రచారం కూడా పూర్తిగా రివర్స్ అయింది.


అసలు మాట్లాడ్డమే చేతకాని లోకేష్ ఆరోపణలు చేస్తే ఇలానే ఉంటుందని నవ్వుకుంటున్నారు ప్రజలు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ పై ఆంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత ఉండి ఉండొచ్చు కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. హైదరాబాద్ లో ఏపీ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో పనులు చేసుకుంటున్నారనే విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటప్పుడు చంద్రబాబు బూటకపు ప్రచారాన్ని వారెలా నమ్ముతారు? అసలు ప్రజలు నమ్మి తమకు ఓట్లు వేస్తారని బాబు ఎలా ఊహించారు? కేసీఆర్ పేరు చెప్పి చేస్తున్న విషప్రచారం టీడీపీకి ఏమాత్రం ఉపయోగపడకపోగా ప్రతిపక్షానికి మేలుచేసేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: