ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ టైం నడుస్తున్నట్లు అర్థమవుతుంది. నేరుగా ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య పాల్గొనలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ లు జరిగాయి. ఈ నేపథ్యంలో బెజవాడ రాజకీయాలలో వైసీపీ పార్టీ నుండి గత ఎన్నికలలో గెలిచిన జలీల్ ఖాన్ టీడీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.


విద్య రాబోతున్న ఎన్నికలకు తన కుమార్తెను నిలబెట్టిన జలీల్ ఖాన్ ఇటీవల నామినేషన్ తన కుమార్తె చేత వేయించారు..అయితే ఎన్నికల అఫిడవిట్లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకోకుండా నామినేషన్ వేయడంతో తిరస్కరణకు గురైన టూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టాక్ వినపడుతోంది.


ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ కూడా తిరస్కరించినట్లు సమాచారం. ఇలా వరుసగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నామినేషన్లు దాఖలు చేయడంతో తిరస్కరణకు గురవటంతో పార్టీ నాయకులలో అధిష్టానవర్గం తిరస్కరణకు గురైన అభ్యర్థులపై వారి నిర్లక్ష్యం పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: