నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది.  పోలింగ్ కి పట్టుమని పదిరోజులు కూడా లేవు,  అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా-ఎలక్ట్రానిక్ మీడియా - ప్రజా సముద్రంలో ప్రచార హోరును తారాస్థాయికి తీసుకు వెళ్తున్నాయి.  తెలుగు దేశం పార్టీ మూడు సభలు - ఆరు ప్రెస్ మీట్లు అన్న చందంగా హుటా హుటిన నిర్వహిస్తుంది. 

పుష్కలమయిన ఆర్థిక వనరులన్నటువంటి అధికార పార్టీ - అందులోనూ ప్రచారలల్లో తెలుగు దేశ ప్రచారమే వేరయా అన్నట్లుండే దోరణి అన్నీ కావలసిన హంగామాని సృష్టిస్తున్నాయి.  అన్నీ వున్నా అల్లుడినోట్లో... అన్న చందంగా అయిదేళ్ల పాలన కంటే, తన 40 ఏళ్ల అనుభవ పూరిత దార్శనికత కంటే కూడా ఎక్కువగా చంద్రం సారు...కేసీఆర్ నే ఎక్కువగా నమ్ముకున్నారా అన్న విధంగా కొనసాగుతుంది ప్రచారం. 


ఎక్కవ-ఎప్పుడు-ఎలా అయినా కేసీఆర్, జగన్ ఒక్కటయ్యారు.. అందుకే ఆంధ్ర వాళ్లు కేసీఆర్ మీద కసిని తేదేపాకి ఓటు వేసి తీర్చుకోవాలని పిలుపునివ్వడమే సరిపోతుంది చంద్రంసారుకి.

తెలంగాణలో తను వెళ్లి కేసీఆర్ ని గెలిపించినట్లు - కేసీఆర్ పేరు ఆంధ్రలో తనను గెలిపిస్తూ మళ్లీ సీఎం ని చేస్తుందని అనుకుంటున్నారో బాబోరు.
ఆదివారం నుంచి శనివారం కి ఆర్రోజులయితే- శనివారం నుంచి ఆదివారంకి ఒక్కరోజే అని తేదేపా - చంద్రం సారు గమనిస్తే మంచిదేమో అని ఏపి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: