ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని నియోజక వర్గాలు ఉన్న కొన్ని నియోజక వర్గాలు మాత్రం చాలా ఆసక్తిని రేపుతుంటాయి. అక్కడ ఎవరు గెలుస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాగే వాటి మీదే బెట్టింగ్ లు కూడా జోరుగా సాగుతుంటాయి. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది చెప్పడం కష్టంగా మారింది. అందుకే ఈ నియోజకవర్గాల్లో గెలుపు - మెజారిటీలపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లు కుమ్మరిస్తున్నారు.. 1. భీమవరం:  మెజారిటీపైనే బెట్టింగ్పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న భీమవరం సీటులో ప్రధానంగా ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై బెట్టింగ్ కాస్తున్నారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం.. పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో ఇక్కడ గెలుపు పక్కా.


అందుకే పవన్ మెజార్టీపైనే పందాలు కాస్తున్నారు.. 2. గుడివాడ బస్తీమే సవాల్.. కోట్ల పందాలు వైసీపీలో గండరగండరుడిగా పేరొందిన కొడాలి నాని ఓ వైపు.. దశాబ్ధాల ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న దేవినేని ఫ్యామిలీ నుంచి అవినాష్ ఓ వైపు పోటీపడుతుండడంతో ఈ ఇద్దరు గెలుపు ఎవరిదనే దానిపై బెట్టింగ్ రాయుళ్లు ప్రధానంగా పందాలు కాస్తున్నారు. ఈ నియోజకవర్గంపై కోట్లు కుమ్మరిస్తున్నారు. 3. మంగళగిరిలో నారాలోకేష్ బోణీపైనే బెట్టింగ్ఇన్నాళ్లు తండ్రి ప్రోద్బలంతో ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి అయిన నారాలోకేష్ కు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. తొలిసారి ఎమ్మెల్యే బరిలో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాడు. చెమటోడుస్తున్నాడు.


ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ బలంగా ఉన్నారు. దీంతో ఇక్కడ లోకేష్ బోణీ కొడుతాడా? లేదా అన్నదానిపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లు పందాలు కాస్తున్నారు. లోకేష్ గెలుపుపైనే అందరి దృష్టి నెలకొంది. 4. భీమిలి:  ప్రత్యేకం.. వైసీపీ నెగ్గుతుందా.? బెట్టింగ్..మంత్రి గంటా శ్రీనివాసరావు ఓటమి భయంతో వదిలేసిన భీమిలి సీటులో ఆయన అనుచరుడు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా.? టీడీపీ అభ్యర్థి సబ్బం హరి నిలుస్తాడా అన్నది ఉత్కంఠగా మారింది. కీలకమైన ఈ సీటుపై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు. 5. హిందూపురంలో బాలయ్య దబిడదిబిడేనా? హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అక్కడ బాలయ్య - ఆయన పీఏకు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకొచ్చారు. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్య గెలుపు ప్రతిష్టాత్మకమైంది. దీంతో ఇక్కడ బాలయ్యపై లక్షలు పందాలు కాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: